Bangalore Crime News: బెంగుళూరులో దారుణం జరిగింది. ప్రియుడి మోజులోపడి దేవుడి సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తను దారుణంగా చంపేసింది ఆ ఇల్లాలు. ప్రియుడితో కలిసి ఈ స్కెచ్ వేసింది. పాపం పండితే ఇంకేముంది.. కాలమే సమాధానం చెబుతోంది. ఆ మహిళ విషయంలోనూ అదే జరిగింది. సంచలనం రేపిన ఈ ఘటనలో ముగ్గురు జైలుపాలయ్యారు. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఇద్దరు ప్రియుల ముద్దుల బ్యూటీ
కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల జనార్థన అదే ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల ఎలన్ మేరీని ప్రేమించాడు. కాలేజీలో చదువుతున్నప్పుడే లవ్ ట్రాక్ పడింది. ఇద్దరు వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో అబ్బాయి తరపు బంధువులు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించలేదు.
పెద్దలను కాదని సీక్రెట్‌గా మ్యారేజ్
చివరకు పెద్దలను కాదని జనార్థన-ఎలన్ మేరీలు ఒక్కటయ్యారు. వీరిద్దరు కలిసి నాగై జిల్లాలో వేలంగన్నికి వచ్చి మాతా గుడిలో మ్యారేజ్ చేసుకున్నారు. చిన్నపాటి లాడ్జిలో మకాం పెట్టారు. ఇంతవరకు స్టోరీ బాగానే సాగింది. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది.
ఆదివారం జనార్థన వేలంగన్ని రైల్వేస్టేషన్ సమీపంలో శవమై కనిపించాడు. కలికాలం ఏంటంటే.. ఎలన్‌మేరీ ఓ వైపు జనార్థన ప్రేమిస్తున్నట్లు నటిస్తూనే.. మరోవైపు 19 ఏళ్ల జీవన్‌తో ప్రేమాయణం సాగించింది. ఈ విషయం బయటపడితే జనార్థన తనను చంపేస్తాడని భావించింది. సైలెంట్‌గా ప్రియుడు జీవన్‌తో కలిసి భర్త జనార్థనను మట్టుబెట్టాలని ప్లాన్ చేసింది.
ALSO READ: బైకులను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో నలుగురు మృతి
ప్రియుడితో కలిసి భర్తను మర్డర్ చేసింది
ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం వేలంగన్నిలో జనార్థనను వివాహం చేసుకుంది ఎలన్ మేరి. తన ప్రియుడు జీవన్‌తో కలిసి చివరకు భర్తను హత్య చేసింది. వాస్తవానికి ఎలన్ మేరీకి రెండేళ్ల కిందట ధర్మపురిలో వివాహం జరిగింది. ఆ తర్వాత ఏమైందో తెలీదు. జనార్థనను ప్రేమించినట్టు నటించింది రెండో పెళ్లి చేసుకుంది.
జనార్థనతోపాటు లవ్ నడుపుతూ జీవన్‌ను పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసింది, భర్తను చంపేసింది. జీవన్ తోపాటు మరెవరైనా ఉన్నారా? లేదా అనేది పోలీసుల విచారణలో బయటపడనుంది. ఈ కేసులో పోలీసులకు ఎలా చిక్కారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీకెమెరాలను పరిశీలించారు పోలీసులు. మేరీతో కలిసి ఉన్న ఇద్దరు వ్యక్తులను గుర్తించారు.
రైలులో తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయాలు బయటపడ్డాయి. శివమొగ్గ ప్రాంతానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు 19 ఏళ్లు జీవన్. మరొక బాలుడికి 15 ఏళ్లు. జనార్థనను కడ తేర్చడంలో మేరీకి వీరిద్దరు సహకరించారు. ఈ హత్యకు సంబంధించి నిందితులు ఎలన్ మేరి, జీవన్‌తోపాటు మైనర్ బాలుడ్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.