BigTV English

Actor Rahul Vijay: హీరోయిన్స్ తో వెకేషన్.. ఈ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా..?

Actor Rahul Vijay: హీరోయిన్స్ తో వెకేషన్.. ఈ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా..?

Rahul Vijay: ప్రముఖ యంగ్ హీరో రాహుల్ విజయ్ (Rahul Vijay) ఎక్కువగా తెలుగు చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ అందుకున్నారు. ఈయన ఎవరో కాదు స్టంట్ మాస్టర్ విజయ్ (Vijay ) కొడుకు. 2018లో రొమాంటిక్ డ్రామా చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన రాహుల్.. ఆ తర్వాత నిహారిక (Niharika )లీడ్ రోల్ పోషించిన ‘సూర్యకాంతం’ సినిమాలో మరోసారి నటించి మంచి గుర్తింపు అందుకున్నారు. ఇక తర్వాత ‘కళాశాల కుమార్’, ‘పంచతంత్రం’, ‘కోటబొమ్మాళి పీఎస్’ , ‘విద్యావాసుల అహం’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈయన, ‘కుడిఎడమైతే’, ‘యక్షిణి’ వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించారు.


యంగ్ హీరోగా మంచి పేరు దక్కించుకున్న రాహుల్.. తాజాగా హీరోయిన్స్ తో కలిసి వెకేషన్ కి వెళ్లారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ తో వెకేషన్.. ఈ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. ఇకపోతే వెకేషన్స్ కి వెళ్ళిన వారి విషయానికి వస్తే.. యాంగ్రీ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరో రాజశేఖర్ (Rajasekhar )కూతుర్లు శివాని(Shivani), శివాత్మిక (Shivatmika) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వీరిద్దరూ కూడా తెలుగులో పలు సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. నటి శివాని కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఈ అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు.

ఇక తాజాగా శివాని, శివాత్మిక ఇద్దరూ కలిసి తమ ఫ్రెండ్స్ తో అమెరికా ట్రిప్ కి వెళ్లారు. అక్కడ అమెరికా వెకేషన్స్ లో భాగంగా తమ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ.. దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలో శివాని, శివాత్మికతో పాటు నటుడు రాహుల్ విజయ్, హీరోయిన్ షాలిని కొండేపూడి (Shalini Kondepudi) కూడా ఉన్నారు. అంతేకాదు వీరితో పాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు. ముందు నుండే శివాని, రాహుల్, షాలిని మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసి వెకేషన్స్ కి వెళ్తూ ఉంటారు.


ఇక మరో హీరోయిన్ షాలిని కొండేపూడి విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఈమె నటి మాత్రమే కాదు రచయిత కూడా. ఇకపోతే శివాని రాజశేఖర్, రాహుల్ ఇప్పటికే ‘కోటబొమ్మాళి పీ.ఎస్’, ‘విద్యావాసుల అహం’ అనే రెండు సినిమాలలో కూడా నటించి, ఇప్పుడు వెకేషన్స్ కోసం ఫారిన్ ట్రిప్ కి వెళ్ళిపోయారు. స్టార్ కిడ్స్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ఇద్దరు అక్కచెల్లెళ్లు, స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకోవాలని వరుస సినిమాలతో బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో వీరు నిలదొక్కుకుంటారో చూడాలి.

 

View this post on Instagram

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×