Medicover Counter On KTR: బీఆర్ఎస్‌కు కష్టాలు రెట్టింపు అవుతున్నాయా? ఆ పార్టీకి ఒక సమస్య తర్వాత మరొకటి వెంటాడుతోందా? మొన్న మూసీ.. నిన్న ఫార్ములా రేస్.. నేడు వికారాబాద్ ఘటన.. ఇలా ఒక దాని మరొకటి ఆ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నాయా? అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు.
బీఆర్ఎస్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. అధికార పార్టీ నేతల మాటల నుంచి తప్పించు కునేందుకు కొత్త కొత్తవి తెరపైకి తెస్తోంది. చివరకు అపఖ్యాతి మూటగట్టు కుంటోంది. సింపుల్‌గా చెప్పాలంటే కేటీఆర్ లాంటి నేతలు ఇబ్బందులు పడుతున్నారు.
వికారాబాద్ ఘటన నుంచి తప్పించుకునేందుకు తెరపైకి మెడికవర్ యాజమాన్యాన్ని లాగేశారు కేటీఆర్. అంతేకాదు రకరకాల ఆరోపణలు చేశారు. వెంటనే రంగంలోకి దిగేసింది మెడికవర్ యాజమాన్యం. మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిందే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు.
ఆ విషయాన్ని మరిచిపోయిన కేటీఆర్, ఆ యాజమాన్యంపై నోరు జారారు. ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీతో మెడికవర్‌కు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఎక్కడా రాజకీయపరమైన విషయాల్లో మా జోక్యం ఉండదని వివరంగా చెప్పింది.
ALSO READ: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ట్రాఫిక్ ఏసీపీ.. నా కారే ఆపుతారా అంటూ..
బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రులు ఈటల, హరీష్‌రావులు మా ఆసుపత్రులు ప్రారంభించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసింది. పేషెంట్ విషయంలో సాయం కోరితే చేస్తామని తెలిపింది. సీఎం రేవంత్‌రెడ్డికి డాక్టర్ శరత్ 15 ఏళ్లగా తెలుసని, దానితోనే వరంగల్ లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభించామని తెలియజేసింది.
లగచర్ల ఘటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన కేటీఆర్, ముఖ్యమంత్రి అల్లుడికి చెందిన మ్యాక్స్ బీఎన్ కంపెనీ విస్తరణ కోసం రైతుల భూములను తీసుకుంటున్నారని ఆరోపించారు. శరత్ అనే వ్యక్తి అందులో ఉన్నారని, ఆయన మెడికవర్ హాస్పటల్ యాజమాన్యం ఓనరని విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే.
ఇదేకాదు.. ఫార్ములా రేస్ స్కామ్ విషయంలో ఏసీబీ దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసులో గవర్నర్ పర్మీషన్ కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఆయన నుంచి పర్మీషన్ రాగానే కేటీఆర్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం జోరుగా సాగింది. దానిపై మాట్లాడిన కేటీఆర్, అరెస్ట్ చేస్తే చేయ్యండి.. జైలుకి వెళ్తానని అన్నారు.
ఇదే క్రమంలో అమృత్ టెండర్ల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ఇలా అధికార పార్టీ తెరపైకి తెచ్చిన ప్రతీ ఇష్యూని పక్కదాని పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్. వికారాబాద్ కలెక్టర్, మిగతా అధికారులపై దాడుల నేపథ్యంలో ఉద్యోగులు కారు పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు, నిరసనలకు పిలుపునిచ్చింది తెలంగాణ ఉద్యోగుల జేఏసీ.
Medicover Management Refutes KTR’s Allegations
కేటీఆర్ ఆరోపణలను ఖండించిన మెడికవర్ యాజమాన్యం
👉'మెడికవర్'ను ప్రారంభించిందే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.
👉ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీతో 'మెడికవర్'కు సంబంధం లేదు.
👉ఎక్కడా రాజకీయపరమైన విషయాల్లో మా జోక్యం ఉండదు.#Medicover… pic.twitter.com/UgxYpUDNGs— Congress for Telangana (@Congress4TS) November 13, 2024