trinayani serial today Episode: గాయత్రి పాపను చంపేందుకు తిలొత్తమ్మ ప్లాన్ చేస్తుంది. అందుకోసం ప్రూట్ జ్యూస్‌లో విషం కలిపి గాయత్రి పాపకు ఇవ్వాలనుకుంటుంది. అందుకోసం స్వయంగా తిలొత్తమనే జ్యూస్ రెడీ చేస్తుంది. ఇంతలో వల్లభ వచ్చి మమ్మీ ఏంటి నువ్వు జ్యూస్ చేస్తున్నావు ఎవరికి అని అడుగుతాడు. గాయత్రి పాప కోసం అని చెప్తుంది తిలొత్తమ్మ. పాప కోసం జ్యూస్ చేస్తున్నావంటే నువ్వు నిజంగా సూపర్ మమ్మీ అంటాడు వల్లభ. అదేం లేదు వల్లభ పునర్జన్మలో ఉన్న గాయత్రి అక్కను బాగా చూసుకోవడం కాదు.
ఈ జన్మలో కూడా అక్క ప్రాణాలు నేనే తీయాలని జ్యూస్ రెడీ చేస్తున్నాను అంటుంది తిలొత్తమ్మ. జ్యూస్ రెడీ చేస్తే ప్రాణాలు పోతాయా మమ్మీ ఎక్కడైనా అని వల్లభ వెటకారంగా అంటే… ఓరే పూల్ ఇందులో విషం కలిపానురా..? అంటుంది. ఇంతలో సుమన అక్కడికి రాగానే తిలొత్తమ్మ ఈ జ్యూస్ తీసుకెళ్లి పాపకు తాగించమని సుమనకు చెప్తుంది తిలొత్తమ్మ. దీంతో సుమన నేను ఇవ్వను అయినా నేనెందుకు పాపకు జ్యూస్ తాగించాలి అని ఎదురు ప్రశ్నిస్తుంది. దీంతో నువ్వు పాపను మంచిగా చూసుకుంటున్నట్టు విశాల్ దగ్గర మార్కులు కొట్టేస్తే అప్పుడు ఆస్థిలో నీకు కూడా వాటా ఇస్తాడని తిలొత్తమ్మ చెప్పగానే అయితే సరే నేనే పాపకు జ్యూస్ తాగిస్తానని తీసుకుని వెళ్తుంది సుమన.
యమలోకం వెళ్లిన నయని విచిత్రంగా చూస్తూ అక్కడే ఉన్న యముణ్ని నేను ఎక్కడికి వచ్చానని అడుగుతుంది. యముడు విచిత్రంగా చూస్తూ.. యమపురికి వచ్చి ఎక్కడికి వచ్చాను అంటావేంటి బాలిక అంటాడు. దీంతో నయని షాక్ అవుతుంది. నేను యమలోకం రావడం ఏంటి..? నాకు గండం ఉందని తెలుసు కానీ దాన్ని తప్పించడానికి విశాలాక్షి అమ్మ అండ ఉందని తెలుసు. అది దాటితే నిండు నూరేళ్లు నా భర్తకి సేవలు అందిస్తూ పిల్లలతో సంతోషంగా ఉండి చివరి దశలో సుమంగళిగా వెళ్లిపోతాను అని తెలుసు. కానీ ఇలా అర్థాంతరం ప్రాణాలు వదలడం ఏంటి స్వామి అని బాధగా అడుగుతుంది నయని.
ఏంటి బాలిక ఏమీ మాట్లాడుతున్నావు అసలు నీకు వివాహమే కాలేదు. పిల్లలు, భర్త అని మాట్లాడుతున్నావేంటి… అని యముడు అడగ్గానే అదేంటి స్వామి నాకు పెళ్లి కాకపోవడం ఏంటి..? పిల్లలు లేకపోవడం ఏంటి..? అందరి జాతకాలు మీ దగ్గర ఉంటాయి కద స్వామి ఒకసారి నా జాతకం చూడండి నేను ఇద్దరు కవల పిల్లలకు తల్లిని నాకు పెళ్లి కాలేదు అంటారేంటి. నేను నిజం చెప్తున్నా స్వామి. మా తాతయ్య శంకర శాస్త్రి గారు నేను సంపూర్ణ ఆయుష్షుతో ఉంటానని చెప్పారు. ఆయన జాతకం రాస్తే తిరుగే ఉండదు. అదీ కాక నేను అమ్మవారి భక్తురాలిని నేను కైలాసంలో ఉండే అమ్మవారిలో ఐక్యం అవుతాను కానీ ఇక్కడికి ఎలా వస్తాను అంటూ నయని యముణ్ని ప్రశ్నిస్తుంది.
దీంతో యముడు గట్టిగా నవ్వుతూ..నువ్వు అసత్యం చెప్పడమే పెద్ద పాపం నీకు ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పు లేదు ఎవరక్కడా. అంటూ భటులను పిలుస్తాడు యముడు. ఇంతలో చిత్రగుప్తుడు వచ్చి ప్రభు మీరు నన్ను క్షమిస్తానంటే మీకో నిజం చెప్తాను. మీరు నా ప్రాణం తీయనని హామీ ఇస్తే ఆ నిజం ఇప్పుడే మీకు చెప్తాను అంటాడు. దీంతో యముడు చెప్పు చిత్రగుప్త ఆ నిజం ఏంటో అంటాడు. దీంతో చిత్రగుప్తుడు ప్రభు ఈ పుణ్య వతి చెప్పింది అక్షర సత్యం. తనకు వివాహం అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు అని గుప్త చెప్పగానే యముడు అవునా అయితే నేనే నేనే పొరపడ్డానా లేదు లేదు ఈ యమపాశం కచ్చితంగా త్రినేత్రి ప్రాణాలు తీసుకొనే వచ్చి ఉంటుంది. అంటాడు. దీంతో నయని షాకింగ్ గా యముణ్ని చూస్తూ.. స్వామి నా పేరు త్రినేత్రి కాదు త్రినయని అంటుంది.
దీంతో చిత్రగుప్తుడు జరిగిన పొరపాటు చెప్తాడు. దీంతో గుప్తను యముడు తిడతాడు. మూర్ఖుడా ఎంత తప్పిదం చేశావు అంటూ త్రినయని సంపూర్ణ ఆయుష్కురాలు అంటాడు యముడు. నిజం తెలుసుకున్న నయని యముడితో గొడవ పడుతుంది. ఇదేనా మీరు చేసే న్యాయం. నా భర్తని నా పిల్లల్ని నాకు దూరం చేశారు అంటూ నిలదీస్తుంది. నాకు న్యాయం చేయమని ముక్కోటి దేవతల్ని అడుగుతా.. లేదంటే నా ప్రాణాలు తిరిగి నా దేహంలోకి పంపండి నేను వెళ్లిపోతాను అంటుంది. దీంతో తొందర పడకు బాలిక ఇప్పుడు నిన్ను నీ శరీరంలోకి పంపినా మూడు నెలల వరకు నువ్వు కొమాలోనే ఉండెదవు.. అలా కాదనుకున్నా..? ఇంకొకరి శరీరంలోకి నిన్ను పంపెదము అంటూ త్రినేత్రిని చూపిస్తారు.
నయని తాను మూడు నెలలు కోమాలో ఉండలేనని అంత వరకు త్రినేత్రి శరీరంలో ఉంటానని చెప్తుంది. అయితే సరేనన్న యముడు.. పునర్జన్మలో ఉన్న పాపకి అయినా గాయత్రీదేవికైనా నీ చేయి తాకితే నీకు మూడు గంటల వరకు నయని అని గుర్తు వస్తుంది. తర్వాత 21 గంటలు నువ్వు త్రినేత్రిలాగే ఉండాలని.. ఈ రహస్యం ఎవరికైనా చెప్పితే మూడు నెలల తర్వాత నువ్వు నీ దేహాన్ని కూడా ఆశ్రయించలేవు బాల. ఇది యమపురి శాశనం. అని యముడు చెప్పగానే సరేనని అంటుంది నయని. ఎవ్వరికీ చెప్పను అనగానే నయని ఆత్మను పంపిస్తాడు యముడు.
తిలొత్తమ్మ ఇచ్చిన జ్యూస్ తీసుకుని పాప దగ్గరకు వచ్చిన సుమన. పాపను విక్రాంత్ ఎత్తుకుని ఉండటం చూసి ఆ జ్యూస్ కూడా విక్రాంత్ ఇస్తుంది. పాపకు తాగించమని చెప్తుంది. విక్రాంత్ పాపకు జ్యూస్ తాగించడానికి ప్రయత్నిస్తుంటే పాప తాగదు. ఎంత ప్రయత్నించినా పాప తాగకపోయే సరికి అక్కడే ఉన్న వల్లభ ఇరిటేటింగ్ గా పాపను చూస్తూ.. పాప నువ్వు జ్యూస్ తాగకపోతే నేను తాగేస్తాను అంటాడు. అయినా పాప తాగకపోతే.. వల్లభ కోపంగా విక్రాంత్ చేతిలోని జ్యూస్ లాక్కుని తాగి ఇదిగో ఇలా తాగాలి అని పాపకు చెప్తాడు. పక్కనే ఉన్న తిలొత్తమ్మ షాక్ అవుతుంది. ఏమీ తెలియనట్టు వల్లభ ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు అంటూ జ్యూస్‌లో విషం కలిపింది గుర్తుకు వచ్చి భయంతో అటూ ఇటూ పరుగెడుతుంటాడు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.