E-Paper
Advertisement

Sampoornesh Babu movie : కంటెంట్ పర్ఫెక్ట్.. కానీ టైమింగ్ రాంగ్.. కాస్త చూసుకోవాలి కదా సంపూ..

Sampoornesh Babu movie : కంటెంట్ పర్ఫెక్ట్.. కానీ టైమింగ్ రాంగ్.. కాస్త చూసుకోవాలి కదా సంపూ..
Advertisement
Sampoornesh Babu movie:

Sampoornesh Babu movie: పండగల సమయం అంటే కచ్చితంగా పెద్ద సినిమాలకు గ్రాండ్ ఓపెనింగ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇటువంటి టైంలో కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా సరే పెద్ద హీరోలతో పోటీ పడేందుకు మిడిల్ హీరోలు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. అలాంటిది సంపూర్ణేష్ బాబు మాత్రం ఎంతో ధైర్యంగా తన మూవీతో వచ్చేస్తున్నాడు. మామూలుగా సినీ ఇండస్ట్రీలో రిలీజ్ విషయం లో పెద్ద సినిమాలకు ఒక టైం.. అలాగే చిన్న సినిమాలకు మరొక టైం ఉంటుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఎందుకంటే భారీ సినిమాలు విడుదలైన సమయంలో చిన్న సినిమాలను పట్టించుకునే నాధుడే ఉండడు. అదే ఏ సినిమాలు లేని సమయంలో విడుదల చేస్తే మంచి కలెక్షన్స్ రాబట్టే ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా వరకు చిన్న సినిమాలు టైం చూసుకుని.. పెద్ద సినిమాల విడుదలలు లేకుండా ఉన్నప్పుడు రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేసుకుంటారు. దీనికోసం స్మాల్ సినిమా ప్రొడ్యూసర్స్ ..ఎప్పటికప్పుడు , ఏ మూవీస్ వస్తున్నాయో ఏవి రావడం లేదు లెక్కలు సరి చూసుకుంటూ ఉంటారు. అయితే సంపూర్ణేష్ బాబు ఈ లెక్కలు ఏమీ పట్టించుకునేలా కనిపించడం లేదు.

Advertisement

త‌మిళంలో క‌మెడియ‌న్ యోగిబాబు నటించిన మండేలా మూవీ.. విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాను ‘మార్టిన్ లూథ‌ర్ కింగ్‌’ గా రీ మేక్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ తమిళ్ ఆడియన్స్ కి బాగా నచ్చింది. దాంతో ఇది తెలుగులో కూడా బాగా హిట్ అవుతుంది అనే ఉద్దేశంతో సంపూర్ణేష్ బాబును హీరోగా పెట్టి ఈ మూవీ తీశారు.

‘హృద‌య కాలేయం’, ‘కొబ్బ‌రి మ‌ట్ట‌’ వంటి హిలేరియాస్ కామెడీ చిత్రాలకు ట్రేడ్ మార్క్ అయిన సంపూర్ణేష్ బాబు కామెడీ టైమింగ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీ టైమింగ్ బాగాలేదు అని సినీ విమర్శకులు భావిస్తున్నారు.

Advertisement

ఈ మూవీలో సంపూర్ణేష్ కాస్త డిఫరెంట్ యాంగిల్ లో కనిపించనున్నట్లు టాక్. ఈ చిత్రం ఈనెల 27 న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ మూవీ పై అలాగే సంపూర్ణేష్ బాబు పై ఉన్న నమ్మకంతో చిత్రబృందం పెయిడ్ ప్రివ్యూలను కూడా నిర్వహిస్తోంది. అయితే ఈ చిత్రంపై ప్రేక్షకులలో ఊహించినంత ఆసక్తి మాత్రం కనిపించడం లేదు. మంచి బిర్యానీ ఒక పక్క ,పెరుగన్నం ఒక పక్క పెడితే ఎవరైనా ఏది ఎంచుకుంటారు. మరి కమ్మటి బిర్యానీ లాంటి అగ్ర హీరోల సినిమాలు వచ్చే టైంలో చప్పిడి పెరుగన్నం లాంటి సంపూర్ణేష్ బాబు మూవీ ని ఎవరు పట్టించుకుంటారు.

భ‌గ‌వంత్ కేస‌రి, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు, లియో వంటి క్రేజీ మూవీస్ తలపడుతున్న దసరా పండగ పోటీలో సంపూర్ణేష్ బాబు మూవీ ఎంతవరకు నిలబతుందో తెలియదు. అసలు ఈ ముగ్గురు హీరోల సినిమాలకి థియేటర్లు చాలక ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు సంపూర్ణేష్ బాబు మూవీని ఏ థియేటర్లు తీసుకుంటాయి. ఇలాంటి చిన్న లాజిక్ మూవీ టీం ఎలా మిస్ అయిందో అర్థం కావడం లేదు? కాస్త ఆగి పెద్ద హీరోల కోలాహలం తగ్గాక ఏ మూవీ లేనప్పుడు చూసుకొని వదిలితే ఖచ్చితంగా హిట్ అయ్యే మూవీ ను,చాలా రాంగ్ టైంలో విడుదల చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×