BigTV English
Advertisement

Abraham Lincoln : అమెరికా అధ్యక్షుడిగా లింకన్ తొలి ప్రసంగం.. ఆ మాటలకు సెనేట్ సభ్యులు షాక్..

Abraham Lincoln :  అమెరికా అధ్యక్షుడిగా లింకన్ తొలి ప్రసంగం.. ఆ మాటలకు సెనేట్ సభ్యులు షాక్..

Abraham Lincoln : చెప్పులు కుట్టే వ్యక్తి కుమారుడిగా కటిక దరిద్రాన్ని అనుభవించి, వీధి దీపాల కింద చదువుకున్న అబ్రహాం లింకన్ అమెరికాకి ఏకంగా అమెరికాకి అధ్యక్షుడైన రోజులవి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆయన విజయాన్ని చూసి సొంతపార్టీ వారే ఆశ్చర్యపడ్డారు. ఇక.. ప్రత్యర్థులకు ఇది పీడకలే అయింది.


అమెరికాలోని పెట్టుబడిదారులు, సీనియర్ నాయకులు, కులీనులంతా ఎలాంటి గొప్ప కుటుంబ చరిత్ర లేని లింకన్‌ను అధ్యక్షుడిగా అంగీకరించలేక లోలోపల అతలాకుతలమైపోతున్న నేపథ్యంలో తొలి సెనేట్ సమావేశం జరుగుతోంది. సకల లాంఛనాల మధ్య మాసిన గడ్డంతో బక్కపలచని లింకన్ సెనేట్‌లోకి అడుగుపెట్టాడు.

ఎటుచూసినా సంపన్నులు, ప్రముఖులు, గౌరవనీయ కుటుంబాలకు చెందిన సెనేట్ సభ్యుల మధ్య లింకన్ ప్రమాణస్వీకారం చేసి, సెనేట్‌ను ఉద్దేశించి తన తొలి ప్రసంగాన్ని ప్రారంభించారు. రెండు నిమిషాల ప్రసంగం కాగానే.. ఎంతో గర్విష్టిగా గుర్తింపుపొందిన ఓ సంపన్న సెనేట్ సభ్యుడు లేచి.. బిగ్గరగా అరుస్తూ తన బూట్లను అందరికీ కనిపించేలా చేత్తో పట్టుకుని.. గాలిలో ఊపుతూ లింకన్ ప్రసంగానికి అడ్డు తగిలాడు.


‘ చూడు.. మిస్టర్ లింకన్! నువ్వేదో అనుకోకుండా అధ్యక్షుడవయ్యావు. కానీ.. నువ్వు చెప్పులు కుట్టే వ్యక్తి కొడుకువని మరిచిపోకు ! మీ నాన్న మా ఇంట్లో జీవితాంతం చెప్పులు, బూట్లు కుట్టాడు. ఇదిగో! నేనిప్పుడు చూపిస్తున్న బూట్లు ఒకప్పుడు మీ నాన్న కుట్టినవే!” అన్నాడు.

అతని మాటలకు సభికులంతా గొల్లున నవ్వారు. అలా నవ్వటం ద్వారా తామూ లింకన్‌ను అవమానించామని వారంతా లోలోన సంబరపడ్డారు.

లింకన్ కొన్ని క్షణాలు తన ప్రసంగాన్ని ఆపి, మౌనంగా నిలబడి పోయాడు. అతని హృదయం బద్దలైంది. కళ్ళనుంచి కన్నీళ్లు ధారాపాతంగా కారాయి. కానీ.. అంతలోనే తన భావోద్వేగాన్ని అణచుకుని, ప్రశాంత స్వరంతో తన ఉపన్యాసాన్ని ప్రారంభించి ఇలా అన్నాడు.

‘నేను దేశానికి అధ్యక్షుడిగా ఉన్న ఈ సమయంలో, ఎంతో చరిత్ర గల ఈ సభా సమావేశంలో నాకు మా నాన్నను గుర్తుచేసినందుకు మీకు నా కృతజ్ఞతలు. మీరన్నది ముమ్మాటికీ నిజమే. మా నాన్న చెప్పులు కుట్టడంలో చాలా నిపుణుడు. ఆయన తన వృత్తిలో చూపిన నైపుణ్యం, నిబద్ధతను నేను దేశాధ్యక్షుడిగా నేటి నుంచి నా విధి నిర్వహణలోనూ చూపేందుకు ప్రయత్నిస్తాను’ అన్నాడు.

ఒక్క క్షణం ఆగి, తన గంభీర స్వరంతో, ‘ ఈ పెద్ద మనిషి చెప్పినట్లుగా మా నాన్న వీరి కుటుంబ సభ్యులందికీ చెప్పులు కుట్టి ఇచ్చాడు. వీరి కుటుంబంతో బాటు వీరి బంధువులు, చాలామంది సంపన్నులకూ పాదరక్షలు కుట్టాడు. మా నాన్న చేసి పని చూసి నేనూ కొంత నేర్చుకున్నాను. ఒకవేళ.. మీ వద్ద ఆయన కుట్టిన చెప్పులు, బూట్లు ఉండి.. అవి మీకు సరిపోకపోయినా, బిగుతుగా మారి మీ కాళ్లకు నొప్పి కలిగిస్తుంటే.. వాటిని నాకు ఇవ్వండి. నేను స్వయంగా వాటిని బాగుచేసి మీకు అప్పగిస్తాను. నేను ఆ తండ్రి కొడుకును. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ మా నాన్న చేసిన పనిని చేసేందుకు సిగ్గుపడను’ అంటూ ముగించాడు.

దాంతో సభ అంతా ఒక్కసారిగా మౌనం ఆవరించింది. అంతకు ముందు ఎగతాళిగా నవ్విన సభ్యులంతా మ్రాన్పడిపోయారు. లింకన్ లాంటి రాజనీతిజ్ఞుడిని అవమానించినందుకు లోలోపల సిగ్గుపడ్డారు. అన్నింటికీ మించి ఆయనను ప్రజలు తమ అధ్యక్షుడిగా ఎందుకు ఎన్నుకున్నారో అప్పుడుగానీ వారికి అర్థంకాలేదు.

Related News

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Proddatur: ప్రొద్దుటూరు క్యాసినో వార్

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

Big Stories

×