E-Paper
Advertisement

Biggboss Sivaji: శివన్న పట్టాడురా.. మంచి ఛాన్స్

Biggboss Sivaji: శివన్న పట్టాడురా.. మంచి ఛాన్స్
Advertisement

Biggboss Sivaji: చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ను స్టార్ట్ చేసి హీరోగా ఎదిగాడు శివాజీ. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో వివాదాలను ఎదుర్కున్నాడు. కొన్నేళ్లకు వాటిని కూడా వదిలి.. ఎవరికి కనిపించకుండా ఉన్నాడు. ఇక బిగ్ బాస్ పుణ్యమా అంటూ మళ్లీ శివాజీ రీఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ 7 లో శివన్నగా అందరి మనసులను దోచుకున్నాడు.

కొంతమందికి ఆయన ఆటాడే తీరు నచ్చలేదు కానీ, కొంతమంది మాత్రం శివన్ననే గేమ్ ఛేంజర్ అనే బిరుదును ఇచ్చేసారు. ఇక #90s సిరీస్ తో కూడా శివాజీ మంచి హిట్ అందుకున్నాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాకా.. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు, షోస్ లలో కనిపించడమే తప్ప సినిమాల్లో కనిపించింది లేదు. తాజాగా శివాజీ ఒక  లక్కీ ఛాన్స్ పట్టేశాడు.

Advertisement

వరలక్ష్మీ శరత్ కుమార్, సాయి కుమార్, అతిరారాజ్, వీటీవీ గణేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కూర్మనాయకి సినిమాలో శివన్న కీలక పాత్రలో కనిపించనున్నాడు. మహావిష్ణు అవతారాల్లోని కూర్మావతారం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హర్షవర్థన్ కడియాల దర్శకత్వం వహిస్తుండగా.. ఎంఎం క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్స్ తో కలిసి రోషన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కె విజితా రావ్ నిర్మిస్తున్నారు. స్నిగ్ధ మణికాంత్ రెడ్డి, పూజ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నేడు శివన్న పుట్టినరోజు కావడంతో ఆయనకు విషెస్ చెప్తూ ఒక వీడియో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఒక పవర్ ఫుల్ రోల్ లో శివన్న నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా శివన్న.. పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ పట్టేశాడు. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×