BigTV English

Siddharth – Aditi Rao Secret Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్, అదితి రావు హైదరీ..!

Siddharth – Aditi Rao Secret Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్, అదితి రావు హైదరీ..!
Siddharth Wedding
Siddharth Wedding

Siddharth – Aditi Rao Secrete Marriage: టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలు తీస్తూ ప్రేక్షకాభిమానులను ఎంతగానో అలరించాడు నటుడు సిద్ధార్థ్. అంతేకాకుండా లవర్ బాయ్‌గా కూడా పేరు సంపాదించుకున్నాడు. బాయ్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. ఎన్నో హిట్ సినిమాలతో అందరినీ ఆకట్టుకున్నాడు.


అయితే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇక ఈ మధ్యే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఇటీవల చిన్న సినిమాతో వచ్చి పర్వాలేదనిపించుకున్నాడు. అలాగే మరో స్టార్ హీరో కమల్ హాసన్ చిత్రంలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ క్రమంలో సిద్ధార్థ్‌కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. నటుడు సిద్ధార్థ్ తాజాగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పట్నుంచో లివ్ ఇన్ రిలేషన్‌షిప్ మెయింటెన్ చేస్తున్న నటుడు సిద్ధార్థ్, నటి అదితి రావు హైదరీలు నేడు పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఈ లవ్ కపుల్ తాజాగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయినట్లు టాక్ వినిపిస్తోంది.


Also Read: రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. ఈ పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా బాసు

తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని శ్రీ రంగనాయకస్వామి ఆలయంలో సిద్ధార్థ్, అదితి రావు హైదరీ వివాహం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా తమిళనాడుకు చెందిన పురోహితులు ఈ వివాహ వేడుకలను నిర్వహించినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం గ్రాండ్‌గా జరిగిందని తెలుస్తోంది. అయితే వీరి పెళ్లికి సంబంధించిన వార్తలపై సిద్ధార్థ్ కానీ, అదితి రావు హైదరి కానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు. ఇకపోతే సిద్ధార్థ్, అదితి రావు హైదరి గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నారు. ‘మహా సముద్రం’ సినిమా షూటింగ్ సమయంలో వీరి ప్రేమ చిగురించింది.

ఇక అప్పట్నుంచి ఈ లవ్ కపుల్ పలు ఈవెంట్స్, ఫంక్షన్స్, రెస్టారెంట్లలో కనిపించారు. ఇదిలా ఉంటే.. సిద్ధార్థ్‌కు ఇది రెండో వివాహం.. కాగా అదితి రావుకి కూడా ఇది రెండో పెళ్లి. సిద్ధార్థ్ 2003లో మేఘన అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు.

Also Read: రామాయణం పనులు మొదలుపెట్టిన రణ్‌బీర్.. ఫొటోలు చూసి ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

కానీ అనివార్య కారణాల వల్ల విభేదాలు ఏర్పడి ఇద్దరూ 2007లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే అతడి బాగుబాగోగులు మొత్తం సిద్ధార్థే చూసుకుంటున్నాడు. అలాగే అదితికి కూడా ఇది రెండో మ్యారేజ్. గతంలో సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరి మధ్య కూడా విభేధాలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు.

Tags

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×