BigTV English

Ranbir Kapoor’s Ramayana: రామాయణం పనులు మొదలుపెట్టిన రణ్‌బీర్.. ఫొటోలు చూసి ఖుష్ అవుతున్న ఫ్యాన్స్!

Ranbir Kapoor’s Ramayana: రామాయణం పనులు మొదలుపెట్టిన రణ్‌బీర్.. ఫొటోలు చూసి ఖుష్ అవుతున్న ఫ్యాన్స్!
RAMAYANAM
RAMAYANAM

Ranbir Kapoor’s Ramayana Movies Photos Got Viral in Social Media: రామాయణం.. ఈ ఇతిహాసాన్ని ఎంతో మంది డైరెక్టర్లు ఇదివరకే తెరకెక్కించారు. నాటి నుంచి నేటి వరకు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. రామాయణం పేరుతో ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చాయి. సంపూర్ణ రామాయణము, రామాయణం, శ్రీరామ రాజ్యం, బాల రామాయణం వంటి పేర్లతో రూపొందాయి.


ఇటీవల ఈ ఇతిహాసాన్ని నేటి కాలం సమాజానికి తగ్గట్టుగా ‘ఆదిపురుష్’ పేరుతో తెరకెక్కించాడు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓ రౌత్. అయితే అది బాక్సాఫీసు వద్ద బాగా బెడిసికొట్టింది. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ డిజాస్టర్‌గా మారింది.

ముఖ్యంగా ఈ మూవీలో విఎఫ్ఎక్స్ వర్క్స్ క్వాలిటీ లేకపోవడంతో సినిమాకు సగం దెబ్బ పడింది. అంతేకాకుండా దర్శకుడు రూపొందించిన పాత్రలు కూడా ఎవ్వరికీ అంతగా నచ్చలేదు. రాముడు, రావణాసురుడు, జాంబవంతుడు ఇలా ఎంతో మందిని నేటి ప్రేక్షకులకు అనుగుణంగా తెరకెక్కించాడు. అదే సినిమాను మరింత వెనక్కి నెట్టింది.


Also Read: బాంచత్.. ధరణి గాడు మళ్లొస్తున్నాడు..!

దీంతో సినిమాపై పూర్తి వ్యతిరేకత ఏర్పడింది. ఎన్నో వివాదాలు ఈ చిత్రాన్ని వెంటాడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో రామాయణం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సారి ఈ రామాయణం మూవీలో బాలీవుడ్ హీరో నటించబోతున్నాడు.

ఇటీవలే యానిమల్ మూవీతో ఫుల్ జోష్ మీదున్న ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ రణబీర్ కపూర్ ఈ రామాయణం మూవీలో రాముడిగా నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. దంగల్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన నితేశ్ తివారీ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా.. భారీ రేంజ్‌లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

మొత్తం మూడు భాగాలుగా ఈ సినిమాని రూపొందించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ మూవీలో సీత పాత్రలో సాయి పల్లవి, రావణాసురుడి పాత్రలో రాఖీ భాయ్ యశ్ నటించబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: బ్రేకింగ్.. ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ శేషు మృతి

అంతేకాకుండా హనుమంతుడిగా సన్నీడియోల్, కైకేయిగా లారా దత్త, శూర్పణకగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది సమ్మర్‌లో గ్రాండ్‌గా స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం నడుస్తోంది. ఈ  తరుణంలో ఈ రామాయణం మూవీకి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా సోషల్ మీడియాలో రణబీర్‌కు సంబంధించిన ఫొటోలు చూస్తుంటే రామాయణం మూవీ ప్రీప్రొడక్షన్ పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఆ ఫొటోల ప్రకారం.. రణబీర్‌తో పాటు కొన్ని బాణాలు కూడా కనిపించడం ఈ వార్తలకు బలం చేకూరినట్లయింది. దీంతో అవి గమణించిన నెటిజన్స్ రణబీర్ విలువిద్యలో ట్రైనింగ్ తీసుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ మూవీ న్యూస్ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×