BigTV English

Story Behand ‘Ram Charan’ Name: రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. ఈ పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..? ఎవరికీ తెలియని నిజాలు!

Story Behand ‘Ram Charan’ Name: రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. ఈ పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..? ఎవరికీ తెలియని నిజాలు!
ram charan birthday
ram charan 39th birthday

Behand The Story of ‘Ram Charan’ Name: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు (మార్చి 27) తన 39వ బర్త్ డేను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా తన సతీమణి ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి తిరుమల వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజాలు చేసి దేవుని ఆశీస్సులు అందుకున్నారు. మరోవైపు రామ్ చరణ్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


అభిమానులు, సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు సైతం చరణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సౌత్‌తో పాటు నార్త్ ఫ్యాన్స్ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ..సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు. అయితే సౌత్ ఓకే కానీ బాలీవుడ్‌లో కూడా రామ్ చరణ్‌కు ఫ్యాన్స్ ఉన్నారా? అని అనుకుంటున్నారా. అవును ఉన్నారు.

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటుల్లో రామ్ చరణ్ ఒకరు. రామ్ చరణ్ 2013లో ప్రియాంక చోప్రాతో కలిసి ‘జంజీర్’ అనే సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. కానీ ఆ సినిమా హిందీలో విజయం సాధించలేదు. అయితేనేం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.


కాగా ఈ రోజు రామ్ చరణ్ బర్త్ డే కావడంతో ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులు తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అందువల్ల అతని జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ దంపతులు

రామ్ చరణ్‌ పేరు వెనక ఉన్న అసలు స్టోరీ ఇదే:

మెగాస్టార్ కుటుంబం ఎక్కువగా ఆంజనేయుడిని ఆరాధిస్తారు. అందువల్ల అంజనా దేవి – వెంకట్రావు దంపతులు మెగాస్టార్‌కు ‘చిరంజీవి’ అనే స్క్రీన్ నేమ్‌ని తీసుకోవాలని సలహా ఇచ్చారు. అంటే ‘అమరుడు’.. ఇది హనుమంతుడు శాశ్వతంగా జీవిస్తాడనే నమ్మకానికి సూచన.

అయితే రామ్ చరణ్ పేరులో కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉంది. రామ్ చరణ్ పేరుకి అర్థం శ్రీరాముని పాదాల నుండి వెలువడే కాంతి అని. చిరంజీవి తండ్రి వెంకట్రావు ఆంజనేయ భగవాన్ అమితమైన భక్తుడు. అందువల్ల రామ్ చరణ్ హనుమంతుడి నుండి వచ్చిన ఆశీర్వాదం అని వారంతా భావిస్తారు. కాబట్టి అతనికి రామ్ చరణ్ అని పేరు పెట్టారు.

Also Read: జరగండి.. జరగండి సాంగ్ ఏముంది బాసూ.. వేరే లెవెల్ అంతే..

మరోవైపు అతని తాత కూడా ప్రముఖ వ్యక్తి. చిరంజీవి భార్య సురేఖ తండ్రి, రామ్ చరణ్ తాత అల్లు రామ లింగయ్య స్వాతంత్ర్య సమరయోధుడు. అతను భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా బ్రిటిష్ వారు ఆయన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే అల్లు రామ లింగయ్య స్వాతంత్ర్య సమరయోధుడే కాకుండా, ప్రసిద్ధ హాస్య నటుడు కూడా. అతను తన జీవితంలో 1000కి పైగా చిత్రాలు చేశాడు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్త

రామ్ చరణ్ ఒక అద్భుతమైన నటుడే కాదు వ్యాపారవేత్త కూడా. అంతేకాకుండా తన తండ్రి చిరంజీవిలా పేదలకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. అతను హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్, విమానయాన సంస్థ ట్రూజెట్‌‌కు యజమాని.

ఇక ఈ వ్యాపారాలే కాకుండా తన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించి రక్తదానం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read: చర్చగా మారిన ‘జరగండి’ సాంగ్ బడ్జెట్.. ఖర్చు కనిపిస్తుందంటరా గురువు గారూ..

రామ్ చరణ్ విద్య, యాక్టింగ్ స్కూల్ విశేషాలు:

రామ్ చరణ్, రానా దగ్గుబాటి చెన్నైలోని ఒకే పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నారు. వారు చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు. అలాగే అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి, రామ్ భార్య ఉపాసన జూనియర్ హైస్కూల్‌లో క్లాస్‌మేట్స్. రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగినప్పటికీ, తన ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్‌లో యాక్టింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.

రామ్ చరణ్‌తో పాటు ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, కరీనా కపూర్ ఖాన్, ప్రియాంక చోప్రా వంటి ప్రముఖ తారలు కూడా ఈ పాఠశాలలో నటనను అభ్యసించారు.

Related News

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Big Stories

×