BigTV English

Actress : సీరియల్ నటి ఇంట్లో బాయ్ ఫ్రెండ్ శవం… పెళ్లి పేరుతో వాడుకుని ఇదేం పని?

Actress : సీరియల్ నటి ఇంట్లో బాయ్ ఫ్రెండ్ శవం… పెళ్లి పేరుతో వాడుకుని ఇదేం పని?

Actress : తాజాగా ఒక సీరియల్ నటి ఇంట్లో బాయ్ ఫ్రెండ్ శవమై తేలడం సంచలనంగా మారింది. ఇద్దరూ ప్రేమించుకోవడమే కాదు పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కానీ అదే పెళ్లి ప్రస్తావన ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి, ప్రాణాలు తీసుకునేదాకా తీసుకెళ్ళింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.


నటితో ప్రేమాయణం

వీణ అనే నటి సినిమా ఇండస్ట్రీలో నటిగా మంచి స్టార్డం సంపాదించుకోవాలని ఎన్నో కలలతో, ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ అనుకున్న విధంగా అవకాశాలు రాకపోవడంతో వచ్చిన ఛాన్స్ నే సద్వినియోగం చేసుకుంటూ నెట్టుకొస్తుంది. ఓవైపు సీరియల్స్ మరోవైపు కొన్ని కమర్షియల్ యాడ్స్ చేస్తూ లైఫ్ లో లీడ్ చేస్తున్న ఈ నటి జీవితంలోకి ఓ అబ్బాయి ఎంట్రీ ఇచ్చాడు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇంకేముంది ఇద్దరూ ప్రేమలో కొన్నాళ్లు మునిగి తేలారు. తరచుగా ఫోన్ మాట్లాడుకోవడం, కలుసుకోవడం, నటి ఇంటికి వెళ్లడం చేసేవాడు మదన్ అనే ఆ అబ్బాయి. ఇద్దరూ కలిసి సంతోషంగా కొంతకాలం రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇంటికెళ్లినప్పుడల్లా ఇద్దరు కలిసి హ్యాపీగా పెగ్గేసి, సరదాగా గడిపే వాళ్ళు. కానీ తాజాగా ప్రియురాలు ఇంట్లోనే మదన్ శవమై తేలడం సంచలనగా మారింది.


అసలేం జరిగిందంటే…

వీణ కన్నడ బుల్లితెరపై ప్రసారమవుతున్న ‘జనని’ అనే సీరియల్ తో పాటు పలు సీరియల్స్ లో నటిస్తోంది. ఇప్పుడిప్పుడే నటిగా మంచి పేరు తెచ్చుకుంటున్న ఆమెకు మదన్ ఏడాది క్రితమే పరిచయమయ్యాడు. ఈవెంట్స్ లో డెకరేటర్ గా పని చేసే మదన్ తో పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. ఇక తరచుగా మదన్ ను వీణ ఇంటికి పిలిచి, ఇద్దరూ కలిసి మందు తాగి ఎంజాయ్ చేసేవారట. ఇక త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న తరుణంలో మదన్ కు వీణపై అనుమానం వచ్చిందట. అంతేకాకుండా ఆమె తనతోనే కాకుండా వేరే అబ్బాయిలతో కూడా సన్నిహితంగా ఉండడం నచ్చకపోవడంతో ఆమెను పక్కన పెట్టేసాడట. కానీ తను శారీరకంగా, మానసికంగా వాడుకొని పెళ్లి పేరు తీసుకు రాగానే మొహం చాటేస్తున్న ప్రియుడు పై వీణకు అనుమానం రావడంతో అతన్ని ఇంటికి పిలిచింది. అయితే అంతకంటే ముందే పెళ్లి ప్రస్తావన తీసుకురాగా అతను అంగీకరించలేదట. దీంతో వీణ మదన్ ఇంటికి వెళ్లి బ్లేడ్ తో చేయి కోసుకోవడంతో అతను మరింత భయపడ్డాడు. ఎప్పటిలాగే మంగళవారం సాయంత్రం కూడా వీణ ఫోన్ చేసి మదన్ ను ఇంటికి ఆహ్వానించగా, ఇద్దరు రాత్రి వరకు మద్యం సేవించారట. అక్కడ కూడా పెళ్లి ప్రస్తావని తీసుకురావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది, దీంతో వాష్ రూమ్ పేరుతో మదన్ మరో గదిలోకి వెళ్లి ఉరేసుకుని చనిపోయినట్టు సమాచారం. దీంతో పోలీసులకు సమాచారం అందగా వీణపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. మొత్తానికి నటిగా ఎదుగుతున్న తరుణంలో ఇలా కేసులో చిక్కుకుంది వీణ.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×