BigTV English

Amala Paul: ఘనంగా అమలా పాల్ సీమంతం.. ఫొటోస్ వైరల్

Amala Paul: ఘనంగా అమలా పాల్ సీమంతం.. ఫొటోస్ వైరల్


Amala Paul: మైనా సినిమాతో అమలా పాల్ తన కెరీర్ ను ప్రారంభించింది. డస్కీ ఫేస్.. ముఖం నిండా మచ్చలు.. ఏం హీరోయిన్ రా బాబు అనుకున్నారు కానీ, ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అలా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ తెలుగు, తమిళ్ అని తేడా లేకుండా వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపునే సంపాదించుకుంది.

Also Read: Ramayana: బాలీవుడ్ రామాయణ.. రంగంలోకి ఆస్కార్ విన్నర్లు.. ?


ఇక అమ్మడు సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది. 2014 లో డైరెక్టర్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. మూడేళ్లు కూడా నిండకుండానే అతడితో విడిపోయింది. ఇక మధ్యలో ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. ఈ మధ్యనే ఆమె, జగత్ దేశాయ్ ను రెండో వివాహం చేసుకుంది. పెళ్ళికి ముందే అమలా ప్రగ్నెంట్ కావడంతో ఈ జంట త్వరగా పెళ్లి చేసుకున్నారని వార్తలు కూడా వినిపించాయి. అవేమి పట్టించుకోని అమలా.. భర్తతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. తాజాగా అమలా సీమంతం గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

Also Read:  Family Star: విజయ్ కన్నా ముందు ఫ్యామిలీ స్టార్ కు అనుకున్న హీరో ఎవరో తెలుసా.. ?

గుజరాత్ లోని సూరత్ లో ఈ సీమంతం వేడుకలు సాంప్రదాయబద్దంగా జరిగాయి. ప్రేమ, సాంప్రదాయంతో కూడిన వేడుక అంటూ అమలా ఈ ఫోటోలను షేర్ చేసింది. వైట్ అండ్ మెరూన్ చీరలో అమల ఎంతో అద్భుతంగా కనిపించింది. ఇక ఈ మధ్యనే విడుదలైన ఆడుజీవితంలో అమలా పాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా అమ్మడికి మంచి విజయాన్ని అందించింది. డెలివరీ తరువాత ఈ చిన్నది నటిస్తుందా.. ? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×