Ananthika: అనంతక సునీల్ కుమార్(Ananthika Sunil Kumar) పరిచయం అవసరం లేని పేరు. మ్యాడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే 8 వసంతాలు(8 Vasantalu) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జూలై 20వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అనంతిక వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
సినిమాలలోకి వస్తానని అనుకోలేదు…
అనంతిక కేరళకు చెందిన అమ్మాయనే విషయం మనకు తెలిసిందే. సినిమాలు అంటే ఏమాత్రం ఆసక్తి లేని అనంతిక ఒకసారి మలయాళీ సినిమాలోకి డ్యాన్సర్ గా వెళ్లడంతో అక్కడ డీఓపీ తనను చూసి హీరోయిన్ గా ట్రై చేయమని సలహా ఇచ్చారట. ఇలా ఆయన సలహా మేరకు ఆడిషన్స్ కి వెళ్ళిన ఈమె 2003వ సంవత్సరంలో మ్యాడ్ సినిమాలో అవకాశం అందుకున్నారు. ఈ సినిమా తర్వాత రైడ్, లాల్ సలాం వంటి సినిమాలలో కూడా నటించారు. ఇక త్వరలోనే 8 వసంతాలు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
లా చదువుతున్న నటి…
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను సినిమాలలోకి రావాలన్న ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి డాన్స్ కానీ కరాటే కానీ నేర్చుకోలేదని, అనుకోకుండా తాను సినిమాలలోకి వచ్చానని తెలిపారు. అయితే ఇటీవల కాలంలో తనకు రాజకీయాల(Politics)పై కూడా చాలా ఆసక్తి కలుగుతుందని, రాజకీయాలలోకి రావాలని ఉంది అంటూ తన మనసులో కోరికను బయటపెట్టారు. ఇలా రాజకీయ ఎంట్రీ గురించి ఈమె మాట్లాడుతూ… నాకు మొదటి నుంచి రాజకీయాలు అంటే ఇష్టం లేదు కానీ ఇటీవల కాలంలో ఆసక్తి పెరిగిందని ఈ విషయం నేను బయట చెబితే అందుకేనా నువ్వు ముందు నుంచి “లా” (Law) చేస్తున్నావు అంటూ మాట్లాడతారని తెలియజేశారు. అయితే నేను చదువుతున్న లా, రాజకీయాలలోకి రావాలని చదవలేదని క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాలలోకి వచ్చి అందరికీ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా తన మనసులో మాటను బయటపెట్టారు.
ఇకపోతే సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో నటీనటులుగా కొనసాగుతూ ఎంతో మంది మంచి ఆదరణ సొంతం చేసుకుని రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో కూడా ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి రాజకీయాలలోకి రావాలనే అనంతిక కోరిక బలపడి రాజకీయాలలోకి వస్తారా? లేదంటే సినిమాలలోనే మంచి సక్సెస్ అందుకొని సినిమాలలో కొనసాగుతారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈమె నటించిన 8 వసంతాలు సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ మాత్రం సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తున్నాయి. ట్రైలర్ టీజర్ చూస్తే మాత్రం అనంతిక మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోబోతున్నారని స్పష్టమవుతుంది