Snake News: వర్షాకాలం వచ్చిందంటే పాములు హల్చల్ సృష్టిస్తాయి. ఇన్ని రోజులు నిద్రావస్థలో ఉన్న పాములు ఇప్పుడు బయటకు వచ్చి ఇళ్లల్లో సంచరిస్తుంటాయి. ఇప్పటికే పాము సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నాయి. ఇటీవల పాము కాటు వల్ల శ్రీకాకుళం జిల్లాలో ఓ అమ్మాయి బలైంది. ఇంటి చుట్టు పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోకపోతే.. భారీ నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచుకోవడం, ఎలుకలు, పక్షులు రాకుండా చూసుకోవాలి.
⦿ పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇంటి చుట్టూరా లేదా కుండీలలో ప్రత్యేక మొక్కలను నాటుకోవచ్చు. వాటి సువాసన వల్ల పాములు ఇంటి వైపు రావు. ఒకవేళ ఇంటి వైపు వచ్చినా.. అక్కడ చాలా సేపు ఉండలేదు. సర్ఫగంధ మొక్క చాలా పవర్ ఫుల్. ఈ మొక్క వాసనకు పాములకు వణుకు పుట్టాల్సిందే. అలాగే వార్మ్వుడ్, బంతి చెట్టు, మళ్ల కాక్టస్ ఈ మూడు రకాల మొక్కలను కూడా ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచుకుంటే పాములు ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు. ఈ చెట్ల వాసన చూడగానే పాములు పారిపోతాయి. ఈ మొక్కలు ఎక్కడ దొరికినా మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో నాటుకోండి. పాములు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి.
⦿ ఎలుకలను తినేందుకు పాములు ఇంట్లోకి సంచరిస్తాయి. అలాగే పక్షులు గూడు కట్టుకున్నా పాములు ఇంట్లోకి వస్తాయి. కాబట్టి పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే.. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిఫుణులు సూచిస్తున్నారు. పాములు సాధారణంగా చెత్త, కలుపు మొక్కలు, రాళ్లు, రప్పల మధ్య ఉండేందుకు చాలా ఇష్టపడతాయి. కాబట్టి, ఇంటి చుట్టూ ఉన్న పొదలు, గడ్డి, చెత్త కుప్పలను తీసివేసి శుభ్రంగా ఉంచుకోండి. పచ్చని గడ్డిని కత్తిరించి, ఆకులు, పిచ్చి మొక్కలు వంటివి శుభ్రం చేయండి. ఇంటి బయట ఉన్న రాళ్ల కుప్పలను కూడా తొలగించడం మంచిది. ఎందుకంటే అవి పాములకు ఆశ్రయం కల్పించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
⦿ ఇంటి గోడలు, తలుపులు, కిటికీల వద్ద ఉన్న ఖాళీలను మూసివేయడం మంచిది. పాములు చిన్న రంధ్రాల ద్వారా కూడా సులభంగా ఇంట్లోకి రాగలవు. కాబట్టి, ఇంటి గోడలలో ఉన్న పగుళ్లను, తలుపుల కింది ఖాళీలను, లేదా కిటికీల వద్ద ఉన్న గ్యాప్‌లను సీలెంట్ లేదా సిమెంట్‌తో క్లోజ్ చేయండి. డోర్ స్వీప్‌లను ఉపయోగించడం వల్ల తలుపు కింది భాగంలో ఖాళీలు లేకుండా చేయవచ్చును.
⦿ పాములు కొన్ని వాసనలను అస్సలు ఇష్టపడవు. వెల్లుల్లి, ఉల్లిపాయలు, గంధకం (సల్ఫర్), లవంగ నూనె, దాల్చిన చెక్క నూనె వంటి వాటిని ఇంటి చుట్టూ చల్లడం లేదా వాటి స్ప్రేను ఉపయోగించడం వల్ల పాములు ఇంటి నుంచి దూరంగా ఉంటాయి. ఇంటి ముఖం వైపు కూడా చూడవు.అలాగే, వైట్ వెనిగర్ ను ఇంటి బయటి భాగంలో స్ప్రే చేయడం వల్ల కూడా యూజ్ ఉంటుంది. ఈ పదార్థాలు పాములకు హాని చేయకుండా వాటిని ఇంటికి దూరంగా ఉండేలా చేస్తాయి.