E-Paper
Advertisement

Deviyani: నటి ఫోన్ హ్యాక్.. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి అంటూ పోస్ట్

Deviyani: నటి ఫోన్ హ్యాక్.. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి అంటూ పోస్ట్
Advertisement

Deviyani: టెక్నాలజీ పెరుగుతుంది అని సంతోషపడేలోపు.. దానివలన జరిగే నష్టాలు తెలిసి బాధపడాల్సి వస్తుంది. ముఖ్యంగా సెలబ్రిటీల పై కొంతమంది కక్ష కట్టి వారి ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఐడీలను హ్యాక్ చేసి ఏవేవో చెత్త పోస్ట్ లను పెట్టి వారి పరువు తీస్తూ ఉండడం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా ఒక నటి ఫోన్ నెంబర్ ను హ్యాక్ చేసి.. ఆమెను ఇబ్బంది పాలు చేస్తున్నారట కొంతమంది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది. ఆ నటి ఎవరో కాదు దేవయాని శర్మ.

మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన ఆమెకు సేవ్ ది టైగర్స్ సిరీస్ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో చైతన్య కృష్ణ భార్యగా ఆమె నటించి మెప్పించింది. ఇక ఈ సిరీస్ తరువాత సైతాన్ సిరీస్ లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ గుర్తింపుతో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్న దేవయాని ఫోన్ కొన్నిరోజులు క్రితం హ్యాక్ అయ్యింది. తన నెంబర్ నుంచి ఎలాంటి మెసేజ్ లు వచ్చినా దయచేసి తప్పుగా అనుకోవద్దని, స్పందించవద్దని ఆమె కోరింది.

Advertisement

” కొన్నిరోజుల క్రితం నా ఫోన్ హ్యాక్ అయ్యింది. నా పర్సనల్ డేటా మొత్తం వారి దగ్గర ఉంది. నా ఫోన్ ను హ్యాక్ చేసి వాళ్లు ఏం కోరుకుంటున్నారో నాకు తెలియదు. నా వాట్సాప్ కూడా హ్యాక్ అయ్యింది. నాకు చాలా మార్పులు కనిపిస్తున్నాయి. నా నెంబర్ నుంచి మెసేజ్ లు వస్తే దయచేసి స్పందించకండి. ఇప్పటికే మూడు సార్లు నేను దీనిపై ముంబై పోలిసిలకు ఫిర్యాదు చేశాను. దీనివలన నేను మానసికంగా చాలా కృంగిపోయాను.

ఇదేదో నా పరువు తీసి, నన్ను చెడ్డగా చూపించడానికి చేస్తున్నారు అనుకుంటున్నాను. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా జీవించడమే చాలా కష్టంలో కూడుకున్న పని. ఇక ఇలాంటివి కూడా యాడ్ అయితే మరింత కష్టంగా మారుతోంది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×