BigTV English

PM Modi: ‘ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోంది.. ఐదేళ్లుగా అభివృద్ది శూన్యం’.. ప్రధాని మోదీ

PM Modi: ‘ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోంది.. ఐదేళ్లుగా అభివృద్ది శూన్యం’.. ప్రధాని మోదీ

Prime Minister Modi: ఏపీలో ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అభివృద్ధి అనేది లేకుండా పోయిందని ప్రధాని మోదీ అన్నారు. యువతకు ఉద్యోగాలు లేకుండా చేయడమే కాకుండా.. రైతులను కూడా వైసీపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. ప్రజలను మోసం చేసి జగన్ అధికారంలోకి వచ్చారని అన్నారు. వైసీపీ శాండ్ మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందన్నారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో ఎన్డీఏ ప్రజాగళం సభలో ప్రధాని మోదీ, టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ పాల్గొన్నారు.


‘వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఏపీలో మాఫియాకు ఎన్డీఏ ప్రభుత్వం పక్కాగా ట్రీట్ మెంట్ ఇస్తుంది. ఏపీ ప్రజలు వైసీపీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వం విశ్వాస ఘాతుకానికి పాల్పడింది. ఇక్కడ మాఫియా రాజ్యం నడుస్తోంది. వైసీపీ మంత్రులు గూండాగిరి చేస్తున్నారు. ఇక్కడ రౌడీ రాజ్యాన్ని నడిపిస్తున్నారు. ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది.

ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు. రైతులు ఆందోళనలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కు సహకరించలేదు. ఇంటింటికీ పైపులైన్ల ద్వారా నీళ్లు అందించాలనేది మా లక్ష్యం. ఏపీలో మార్పు రావాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. పోలవరం ప్రాజెక్టును నిర్మించడానికి.. రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. పేదల వికాసం కాదు.. మాఫియా వికాసం కేసం. వైసీపీ ప్రభుత్వం పనిచేసింది’ అని ప్రధాని మోదీ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.


Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×