Big Stories

Sanju Samson: సంజూ శాంసన్ అవుట్.. వివాదాస్పదంగా ఢిల్లీ సహ యజమాని పార్త్ జిందాల్ తీరు

IPL 2024: ఐపీఎల్ మ్యాచ్ లు ఒకవైపు జరుగుతున్నాయి. మరోవైపు వివాదాలు కూడా మిన్నంటుతున్నాయి. అయితే తాజాగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో సంజూ శాంసన్ అవుట్ నెట్టింట మంట పుట్టించింది. ఈ విషయంపై సంజూ అంపైర్ పై వివాదం పెట్టుకుంటుండగా, ఢిల్లీ ఫ్రాంచైజీ సహ యజమాని పార్త్ జిందాల్ వ్యవహరించిన తీరు ఇప్పుడు నెట్టింట వివాదాస్పదంగా మారింది.

- Advertisement -

ముఖ్యంగా మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 221 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో రాజస్థాన్ మొదట తడబడింది. ఓపెనర్లు ఇద్దరూ తక్కువ స్కోరుకి అవుట్ అయిపోయారు. దీంతో కెప్టెన్ సంజూ శాంసన్ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. వీర విహారం చేశాడు.

- Advertisement -

ఇక మ్యాచ్ గెలుస్తుందనుకునే సమయంలో ఒక వివాదాస్పద అవుట్ రచ్చ రచ్చ అయ్యింది. థర్డ్ అంపైర్ కూడా అవుట్ అని ప్రకటించాడు. అప్పటికి తను 46 బంతుల్లో 86 పరుగులు చేసి మంచి ఊపుమీదున్నాడు.

ఢిల్లీ బౌలర్ ముకేష్ కుమార్ వేసిన 16వ ఓవర్ లో షార్ట్ పిచ్ బంతిని సంజూ శాంసన్ లాంగాన్ మీదుగా సిక్సర్‌ కొట్టాడు. అయితే బౌండరీ లైన్ పై ఆ బంతిని హోప్ క్యాచ్ అందుకున్నాడు. అయితే గాలిలోకి ఎగిరి క్యాచ్ పట్టాక హోప్ కాలు బౌండరీకి తాకినట్లుగా టీవీ రీప్లేలో కనిపించింది. హోప్ షూకి… బౌండరీకి మధ్య గ్యాప్ అసలు కనిపించలేదు. అయినా సరే, సిక్సర్ ఇవ్వకుండా శాంసన్ అవుట్ అన్నట్లుగా థర్డ్ అంపైర్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో శాంసన్ ఏం చేశాడంటే అంపైర్లతో వాగ్వాదం పెట్టుకున్నాడు.

అక్కడే స్టాండ్స్ లో ఉన్న ఢిల్లీ ఫ్రాంచైజీ సహ యజమాని పార్త్ జిందాల్ చేసిన ఓవర్ యాక్షన్ నెట్టింట తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇంతకీ తనేమన్నాడంటే, శాంసన్ ఒకవైపు టెన్షన్ గా అంపైర్లతో మాట్లాడుతుంటే, అవుట్ హాయ్.. అవుట్ హాయ్.. అంటూ అరిచాడు.

అంతేకాదు తను గ్రౌండు నుంచి బయటకు వస్తున్నప్పుడు కూడా అతనివైపు వేలు చూపిస్తూ ఇరిటేట్ చేస్తూ కనిపించాడు. ఇలాంటివాళ్లను గ్రౌండులోకి అనుమతించకూడదంటూ పార్త్ జిందాల్ పై తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read: అయ్యో రోహిత్.. అలా చూస్తే బాధేస్తుంది..

ఇదిలా ఉండగా ఇలా అంపైర్లతో వాగ్వాదానికి దిగడమేంటని ఐపీఎల్ నిర్వాహకులు శాంసన్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. శాంసన్ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించారు. చేసింది తప్పు, మళ్లీ అడిగినందుకు పెనాల్టీనా? నెట్టింట ఇంకా మండిపడుతున్నారు. మొత్తానికి ఇప్పుడప్పుడే మంటలు చల్లారేలా లేవు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News