BigTV English

Disha Patani : బాయ్ ఫ్రెండ్ చేతిలో దారుణంగా మోసపోయిన ప్రభాస్ బ్యూటీ..?

Disha Patani : బాయ్ ఫ్రెండ్ చేతిలో దారుణంగా మోసపోయిన ప్రభాస్ బ్యూటీ..?

Disha Patani : బాలీవుడ్ హాట్ బ్యూటి దిశా పటాని పేరు అందరికి తెలిసే ఉంటుంది. రీసెంట్ గా వచ్చిన ప్రభాస్ కల్కి మూవీలో డార్లింగ్ కు జోడిగా నటించి మెప్పించింది. ఆమె అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. దిశా పటాని తెలుగులో కొత్త సినిమాలు ఎప్పుడు చేస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇక ఇటీవలే విడుదలైన మరో పాన్ ఇండియన్ మూవీ `కంగువ`లోను కీలక పాత్రను పోషించింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోలేదు. కానీ ఈమె గ్లామర్ అందానికి ఫిదా సినీ జనం ఆమెకు వరుస ఆఫర్స్ ఇస్తూనే ఉన్నారు. సినిమా లైఫ్ అయితే సాఫిగా సాగుతుంది. కానీ పర్సనల్ లైఫ్ మాత్రం బాగోలేదని ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది.. అసలేం జరిగిందో తెలుసుకుందాం..


సినిమాల పరంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ పర్సనల్ లైఫ్ ఇబ్బందిగా మారిందనే టాక్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. వ్యక్తిగత జీవితం, డేటింగ్ లైఫ్ గురించి తెలిసిందే. దిశా గతంలో ట్యాలెంటెడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేసింది. ఇక అతడితో కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసింది.. ఆ తర్వాత బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరూ ఇప్పుడు మంచి స్నేహితులుగా ఉన్నారు. అయితే టైగర్ ష్రాఫ్ కంటే ముందే దిశా వేరొకరి చేతిలో మోసపోయిందని బాలీవుడ్ మీడియాలో టాక్..

ఈ అమ్మడు గతంలో ఓ వ్యక్తితో పీకల్లోతూ ప్రేమలో మునిగి పోయింది. ఆ వ్యక్తి పేరు పార్థ్ సమథాన్. ఇతను ఒక టీవీ నటుడు. అలాగే పార్త్ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ .. మాస్టర్ మైండ్ వికాస్ గుప్తాకు సన్నిహితుడు. వికాస్ -పార్త్ బహిరంగంగా గొప్ప స్నేహితులు అని అందరికీ తెలుసు. దిశాతో పార్థ్ ఒకానొక సమయంలో నిండా ప్రేమలో మునిగాడు. దిశ గురించి పిచ్చిగా పొసెసివ్‌గా ఉండేవాడు. కానీ ఆ ఇద్దరికీ ఓ ప్రత్యేక కారణం వల్ల బ్రేకప్ అయిందని టాక్.. ఆ కారణం మరేంటో కాదు. దిశ ఫోన్ ను అతను నిత్యం చెక్ చెయ్యడం వల్లే తనకు తీవ్ర కోపాన్ని తెప్పించింది. దాంతో ఆమె అతన్ని వద్దని అనుకుందట ఆ కారణంతోనే బ్రేకప్ చెప్పేసిందట.. నిజానికి తనకు తన ఫోన్ ను చెక్ చేస్తే నచ్చదు అని అందుకే తనను దూరం పెట్టేసిందట. అనుమానం పెట్టుకుంటే జీవితాంతం తనని చూసుకుంటాడనే నమ్మకం లేదని అనుకుంది. అందుకే బ్రేకప్ చెప్పేసింది.. ఇక జీవితంలో తన మొహం చూడకుండా ఉండాలని ఫిక్స్ అయ్యిందట.


ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుస సినిమాలను చేసుకుంటూ బిజీగా ఉండేది. తెలుగులో ప్రభాస్ కల్కి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో ఈ అమ్మడు పేరు ప్రపంచ వ్యాప్తంగా మోగిపోతుంది. ఇక రీసెంట్ కొలీవుడ్ హీరో సూర్య కంగువ సినిమాలో నటించింది. ఆ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×