టీమిండియా కెప్టెన్సీ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah). బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్ లో భాగంగా… మొదటి టెస్ట్ మ్యాచ్ కు జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) కెప్టెన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలోనే రోహిత్ శర్మ ఉండటంతో… జస్ప్రీత్ బుమ్రా కు కేఫ్టెన్సీ అప్పగించారు. తొలి టెస్ట్ కు మాత్రమే జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా వ్యవహరిస్తాడు. అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా మీడియాను అడ్రస్ చేశాడు. టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.
ALSO READ: Dhanashree Verma: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చాహల్ భార్య ధనశ్రీ.. ఆ హీరోతో సినిమా ?
ఈ సందర్భంగా కెప్టెన్సీ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు జస్ప్రీత్ బుమ్రా. బ్యాటర్లకు కాకుండా బౌలర్లకు కెప్టెన్సీ ఇవ్వాలని కోరాడు. పేస్ బౌలింగ్ వేసే వారికి కెప్టెన్సీ ఇస్తే టీమిండియా బాగుపడుతుందని తెలిపాడు. నేనిప్పుడు కూడా పేస్ బౌలర్లు కెప్టెన్ గా ఉండాలని కోరుకుంటా… అదే నా డిమాండ్ అంటూ వ్యాఖ్యానించాడు జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah). ఫేస్ బౌలింగ్ వేసే వాళ్లకు కెప్టెన్సీ ఇస్తే… ప్రత్యర్ధులను కట్టడి చేయవచ్చు అని తెలిపాడు. గతంలో పేస్ బౌలర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు టీమ్ ఇండియా అనేక విజయాలు సాధించిందని గుర్తు చేశాడు.
Also Read: Bhuvneshwar Kumar: ఐపీఎల్ వేలంకు ముందే LSG నుంచి భువనేశ్వర్ కు ఆఫర్ !
ఇప్పుడు కూడా కొత్త ప్రయోగంతో బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించాడు. అయితే… బ్యాటింగ్ చేసే వాళ్లకు కెప్టెన్సీ ఇస్తే… జట్టుకు నష్టం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అంచనా వేశాడు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. అయితే జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah)చేసిన వ్యాఖ్యలు రోహిత్ శర్మను ఉద్దేశించి అని కొంతమంది అంటున్నారు. తాత్కాలిక కెప్టెన్ గా బాధ్యత రాగానే జస్ప్రీత్ బుమ్రా రెచ్చిపోయి మాట్లాడుతున్నారని రోహిత్ శర్మ ఫ్యాన్స్… ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.