Tollywood:ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలలో భక్తి ఎక్కువ అవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక మాట అన్నారు. కుంభమేళాకి వెళ్లి మూడుసార్లు మునిగి, స్నానాలు చేయడం సెలబ్రిటీలకు ఫ్యాషన్ అయిపోయింది అని ఆయన అన్నారు. అయితే ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం కుంభమేళాకి సినీ సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. ఇక వీరితోపాటు పేదలు, సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీలు , వ్యాపారవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు ఇలా ఒకరు కాదు అన్ని రంగాల వారు వెళుతూ త్రివేణి సంఘంలో స్నానమాచరించి తిరిగి వస్తున్నారు. ఇక అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.
మౌని అమావాస్య పూజలో పాల్గొన్న జ్యోతి..
ఇకపోతే అక్కడికి వెళ్లలేని వారు తమ వంతుగా తమకు దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తూ.. భగవంతుడిపై తమకు ఉన్న భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే మౌని అమావాస్య, వసంత పంచమి, రథసప్తమి ఇలా వరుసగా వస్తున్న ప్రతి పండుగలో కూడా తమ వంతు పాల్గొని, భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు భక్తి మార్గంలో ప్రయాణిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ జ్యోతి లబాల (Jyothi labala) కూడా చేరిపోయింది. మౌని అమావాస్య సందర్భంగా తనకు దగ్గర్లో ఉన్న కాలభైరవ ఆలయానికి వెళ్ళిన ఆమె, ప్రత్యేక పూజలు చేసింది. దీపాలు వెలిగించి పువ్వులతో స్వామివారికి అభిషేకం చేసింది. ఆలయంలో పాటించాల్సిన సాంప్రదాయ ఆచారాలన్నింటిని కూడా ఆమె పాటించింది. కర్పూర హారతి ఇచ్చి సంతోషం వ్యక్తం చేస్తూ.. భక్తిని చాటుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని ఆమె ఇంస్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. అంతేకాదు ఆ వీడియోని షేర్ చేస్తూ.. పూజ చేయడం ద్వారా స్వామి ఆశీస్సులు పొందినంత ఆనందం కలుగుతోంది అంటూ తెలిపింది. అయితే ఇది చూసిన కొంతమంది ఈ ఆలయం ఎక్కడ ఉందో చెప్పాలి అని కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ పూజలు పునస్కారాలు చూసి అంతా కుంభమేళా మహిమేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించిన జ్యోతి..
ఇకపోతే ఇటీవల కాలంలో జ్యోతి ఎక్కువగా దేవాలయాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత నెల జనవరి ఒకటవ తేదీన కూడా ఆమె ఇలాగే తెల్లవారుజామున ఆలయానికి వెళ్లి పూజలు చేసింది. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లిన ఈమె అక్కడ ఆలయ పరిసరాలలో తిరుగుతున్న వీడియోని కూడా పోస్ట్ చేసింది. ఇంకా తెల్లవారకపోవడంతో ఆలయం విద్యుత్తు లైట్ల కాంతిలో మెరుస్తూ దేదీప్యమానంగా వెలుగుతూ కనిపించింది. ఆలయ పరిసరాలు అన్నీ కూడా ఎలాంటి రద్దీ లేకుండా నిర్మానుషంగా కనిపించాయి. ఈ వీడియోకి కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జ్యోతిలో ఇంత భక్తి ఎప్పటినుండి మొదలైంది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏదిఏమైనా సెలబ్రిటీలు ఇలా ఒకరి తర్వాత ఒకరు భక్తి పారవశ్యంలో మునిగితేలుతూ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం జ్యోతికి సంబంధించిన ఈ వీడియోలు, పూజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">