BigTV English
Advertisement

OTT Movie : కంటికి కనిపించని శక్తి దాడి చేస్తే… దిమ్మతిరిగే సీ థ్రిల్లర్

OTT Movie : కంటికి కనిపించని శక్తి దాడి చేస్తే… దిమ్మతిరిగే సీ థ్రిల్లర్

OTT Movie : కొన్ని సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చివరివరకు చూసినా, కన్ఫ్యూజన్ గానే ఉంటాయి. ఇటువంటి సినిమాలను రెండు, మూడు సార్లు చూస్తే గాని స్టోరీ ఒక కొలిక్కి రాదు. అంతలా కన్ఫ్యూషన్ చేసే సినిమాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అటువంటిదే. టైం లూప్ లో వచ్చిన ఈ మూవీ జరిగిన సంఘటనలే మళ్లీ జరుగుతూ ఉంటాయి. హీరోయిన్ ఇందులో టైం ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అక్కడ మనుషులు చనిపోతూ ఉంటారు. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..


డైలీ మోషన్ (Daily Motion) లో

ఈ సైకలాజికల్ హారర్ మూవీ పేరు ‘ట్రయాంగిల్’ (Triangle). దీనికి క్రిస్టోఫర్ స్మిత్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కథ జెస్ అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. ఆమె టైమ్ లూప్ లో తనకు తానే ఎదురుపడుతూ ఉంటుంది. ఒక షిప్ లో జరిగే సన్నివేశాలు వణుకు తెప్పిస్తాయి. ఇందులో మెలిస్సా జార్జ్, మైఖేల్ డోర్మాన్, రాచెల్ కార్పానీ, హెన్రీ నిక్సన్, ఎమ్మా లంగ్ వంటి నటులు నటించారు. ఈ మూవీ డైలీ మోషన్ (DailyMotion) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

జెస్ తన కొడుకు టామీతో కలిసి ఒక బోట్ ట్రిప్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తుంది. అయితే జెస్ తన స్నేహితుడు గ్రెగ్ బోట్‌లో, టామీ లేకుండానే ఒంటరిగా హార్బర్‌కి వెళ్తుంది. ఆమె గ్రెగ్‌తో పాటు అతని స్నేహితులు విక్టర్, సాలీ, డౌనీ, హీథర్‌లతో కలిసి సముద్రంలో ప్రయాణం మొదలుపెడుతుంది. సముద్రంలో వీళ్ళంతా సరదాగా ప్రయాణిస్తుండగా, ఒక వింత తుఫాను వచ్చి వారి బోట్‌ను తలకిందులు చేస్తుంది. ఈ ప్రమాదంలో హీథర్ అక్కడికక్కడే చనిపోతుంది. మిగిలిన వాళ్ళు తలకిందులైన బోట్‌పై నిలబడి ప్రాణాలు కాపాడుకుంటారు. కొంత సమయం తర్వాత ఒక పెద్ద షిప్ వారిని రక్షించడానికి వస్తుంది. వాళ్ళంతా ఆ షిప్ లోకి ఎక్కుతారు కానీ అందులో ఎవరూ ఉండరు. అది పూర్తిగా ఖాళీగా కనిపిస్తుంది. అయితే జెస్‌కి ఆ షిప్ ను ఎక్కడో చూసిన భావన కలుగుతుంది.

ఆ షిప్ లో అడుగుపెట్టిన తర్వాత, వింత సంఘటనలు మొదలవుతాయి. ఒక ముసుగు ధరించిన వ్యక్తి వారిని ఒక్కొక్కరినీ చంపుతూ ఉంటాడు. జెస్ ఈ హత్యలను ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమె ఒక టైమ్-లూప్‌లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. చివర్లో ఆ షిప్ లో అందరూ చనిపోయాక, జెస్ ఒడ్డుకు చేరుకుని తన ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆమె తన కొడుకు టామీని చూస్తుంది. అయితే గతంలో నుంచి వచ్చిన జెస్ తన కొడుకుతో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న జెస్ ఆమెను చంపుతుంది. ఇలా టైమ్ లూప్ మళ్లీ మొదలవుతుంది. చివరికి ఈ స్టోరీ ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×