Actress Kasturi : ఒకప్పటి హీరోయిన్ కస్తూరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హీరోయిన్ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. ఈ మధ్య తెలుగు సీరియల్స్ లో మెయిన్ రోల్ చేస్తుంది. అయితే సీరియల్స్ లో పద్దతిగా ఉండే ఈమె బయట మాత్రం యమ హాటు గురు అనే టాక్ ను తెచ్చుకుంది. అంతేనా తనకు సంబంధం లేని విషయాల్లో జ్యోక్యం చేసుకుంటూ నెటజన్స్ చేత దారుణమైన ట్రోల్స్ వేయించుకుంటుంది. అందుకే ఈమె పేరు నిత్యం వార్తల్లో హైలెట్ అవుతుంది. ఒకవైపు వివాదాలు ఉన్నా మరోవైపు కొత్త వివాదాలకు తెర లేపుతుంది. ఇటీవల జరిగిన వివాదం గురించి అందరికి తెలుసు.. ఆమె పై పోలీస్ కేసు నమోదైనదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ కేసు గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది.
వివాదాస్పద నటి కస్తూరి కొత్త వివాదాన్ని కోరి తెచ్చుకుంది. ఇటీవల తీరు తమిళనాడు లో తీవ్ర చర్చినీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం చెన్నై లోని తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరపడంతో కస్తూరి మెడకు చుట్టుకుంది. దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుపడంతో ఈమె క్షమాపణలు చెప్పేందుకు దిగొచ్చింది. ఇక తెలుగు నా మెట్టినిల్లు, తెలుగు వారంతా నా కుటుంబం అంటూ వివరణ ఇస్తూనే అధికార డీఎంకే వాళ్లు తనపై కుట్ర చేస్తున్నారని వివరణ ఇచ్చింది. అయినప్పటికీ తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కస్తూరి పై చెన్నై మరియు మదురై సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేసారు..
తెలుగు వాళ్ళను తక్కువ చేసిందనే వార్తలు ఒకవైపు వినిపిస్తున్నా మరో వివాదానికి తెరలేపింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో బ్రాహ్మణేతరులు లంచాలు తీసుకుంటున్నారని కస్తూరి మాట్లాడడాన్ని ఉద్యోగ సంఘాలు ఖండించాయి. ప్రభుత్వ ఉద్యోగులపై నోటికొచ్చినట్టు మాట్లాడడాన్ని తమిళనాడు రెవెన్యూ అధికారుల సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమె వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెపై చెన్నైలోని పలు స్టేషన్స్ లో కేసులు నమోదు అయ్యయి. కస్తూరిపై నమోదయిన కేసుల్లో ఆమెను విచారించేందుకు చెన్నై పోలీసులు సమన్లు జారీ చేసేందుకు కస్తూరి ఇంటికి వెళ్లారు. కానీ అక్కడ ఆమె ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతో ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉందని విషయమై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.. దీంతో కస్తూరి తమిళనాడు విడిచి దేశం వదలి విదేశాలకు పారిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు ఆమెకోసం గాలిస్తున్నారు.. ఒకవేళ ఎక్కడైనా దొరికితే ఈమెను అక్కడే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో బ్యాన్ చెయ్యాలనే డిమాండ్ వార్తలు వినిపిస్తున్నాయి..