Amoy Kumar: ఐఏఎస్ అమోయ్ కుమార్ చుట్టు భూ కబ్జా కేసుకు తిరుగుతున్నాయి. తాజాగా ఆయనపై మరో ఎఫ్ఐఆర్ నమోదు కానుంది. ఈడీ, పోలీసుల జాయింట్ ఇన్వెస్టిగేషర్‌తో భూ ఆక్రమాలకు పాల్పడిన అధికారులు, ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వ రం మండలంలోని నాగారం భూదాన్ భూముల కేసును పోలీసులు మళ్లీ రీఓపెన్ చేయనున్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ప్రధానంగా అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు మనీలాండరింగ్ యాక్ట్ కింద అరెస్టులకు రంగం సిద్ధం చేశారు. ఈ కేసుతో పాటు ఈడీకి అందిన 12 ఫిర్యాదుల ఆధారంగా స్థానిక పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు చేయనున్నారు.
సివిల్ నేచర్ పేరుతో క్లోజ్ చేసిన నాగారం కేసు సహా ఇలాంటి కేసుల్లో తిరిగి విచారణ ప్రారంభించాలని చెప్పారు సీపీ సుధీర్ బాబు. కేసు దర్యాప్తులో ఈడీ అధికారులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. దీంతో 42 ఎకరాల 33 గుంటల భూదాన్ భూములకు సంబంధించిన కేసు రికార్డులను స్థానిక పోలీసులు మళ్లీ బయటకు తీస్తున్నారు. విచారణ జరపడంతో పాటు సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ కేసును సివిల్ నేచర్ పేరిట గలేడాది మహేశ్వరం పోలీసులు క్లోజ్ చేశారు. ఈ మేరకు కోర్టుకు ఫైనల్ రిపోర్ట్ అందించారు. దీంతో మాజీ తహసీల్దార్ జ్యోతి సహా మరికొంత మంది నిందితులపై నమోదైన ఎఫ్ఎఆర్ గతేడాది ఆగస్టులో క్లోజ్ అయ్యింది. అయితే దీంట్లో అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ పేరు ప్రస్తావనకు రాలేదు.
Also Read: అడ్డంగా బుక్కైన కేసీఆర్.. బీఆర్ఎస్ చేసిన కుటుంబ సర్వే ఎక్కడ
అయితే ఈడీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 181 సర్వే నెంబర్ పరిధిలోని సుమారు 43 ఎకరాల భూదాన్ భూములను అమోయ్ కుమార్ ఆదేశాల మేరకు అప్పటి తహసీల్దార్ జ్యోతి.. పలువురు రియల్టర్లు, ప్రజా ప్రతినిధులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు ఈడీ గుర్తించింది. కేసు తీవ్రత నేపథ్యంలో మళ్లీ రీఓపెన్ చేసి సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఈడీ అధికారులు డీజీపీని కలిశారు. ఇలాంటివే గ్రేటర్ పరిధిలో మూసివేసిన మరికొన్ని కేసులను కూడా పరిశీలించాలని కోరారు. ఈడీకి అందిన 12 ఫిర్యాదులను కూడా స్థానిక పోలీసులు మళ్లీ సమీక్షిస్తున్నారు. నాగారం చేసుకు సంబంధించి గతంలో మహేశవరం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఎఆర్‌ను పునఃపరిశీలించడంతో పాటు అమోయ్ కుమార్ పాత్రపై సమగ్ర దర్యాప్తు జరపనున్నారు.