E-Paper
Advertisement

Maheshwari: శ్రీదేవిది సహజ మరణం కాదు.. ఆమె చెల్లెలు మహేశ్వరి ఏం చెప్పిందంటే..?

Maheshwari: శ్రీదేవిది సహజ మరణం కాదు.. ఆమె చెల్లెలు మహేశ్వరి ఏం చెప్పిందంటే..?
Advertisement

Maheshwari: అందాల అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆమె సోదరిగా ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ మహేశ్వరి. గులాబీ, పెళ్లి, ప్రియరాగాలు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యింది. ఇక తెలుగు, తమిళ్, హిందీభాషల్లో  స్టార్ హీరోల సరసన నటించి మెప్పించినా.. అక్క శ్రీదేవికి వచ్చిన పాపులారిటీని సంపాదించుకోలేకపోయింది. ఇక  వివాహం తరువాత ఇండస్ట్రీకి మహేశ్వరి దూరమయ్యింది.

ఇక మధ్యలో బుల్లితెరపై మై నేమ్ ఈజ్ మంగతాయారు లాంటి కామెడీ సీరియల్ తో  బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించింది మహేశ్వరి. ఎప్పుడైతే శ్రీదేవి మృతి చెందిందో.. అప్పటినుంచి అక్క కూతుళ్ళకు తల్లిగా మారింది. పిన్నిగా తాను చేయాల్సిన బాధ్యతలు చేస్తుంది. నిత్యం జాన్వీ కపూర్ , ఖుషీ కపూర్ కు తోడుగా ఉంటుంది.  మొన్నటికి మొన్న దేవర షూటింగ్ కు కూడా జాన్వీతో పాటు సెట్ లో సందడి చేసింది.

Advertisement

ఇక తాజాగా మహేశ్వరి.. ఒక యూట్యూబ్ ఛానెల్ కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. రవితేజతో మహేశ్వరీ నీకోసం అనే సినిమా చేసిన విషయం తెల్సిందే. రవితేజ గురించి ఆమె మాట్లాడుతూ.. ” రవి చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మా గ్రూప్ లో ఎప్పుడు మెసేజ్ చేసినా రవి.. ఏదో ఒక రిప్లై ఇస్తూనే ఉంటాడు” అని చెప్పుకొచ్చింది.

ఇక బెస్ట్ డ్యాన్సర్ అంటే.. ఎన్టీఆర్ అనే చెప్తాను. దేవర షూటింగ్ కు వెళ్లాను. అక్కడ ఎన్టీఆర్ డ్యాన్స్ అదిరిపోయింది.. జాన్వీ పక్కన చూస్తూనే ఉన్నాను. ఇక నాకు అజిత్ అంటే చాలా ఇష్టం.. అతను నా క్రష్. మేము ఇద్దరం కలిసి  రెండు సినిమాలు చేశాం. ఆ సమయంలో ఎక్కువ మాట్లాడుకొనేవాళ్లం. అలానే అజిత్.. ఇంటికి వెళ్లి  మహి అని పిలిచేవాడట.  అజిత్ అలా అనేసరికి అతని గర్ల్ ఫ్రెండ్ గొడవ  పెట్టుకుందంట. నేను పెట్ లవర్ ను.. రోజు 150 డాగ్స్ కు ఫీడ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తాను అని చెప్పుకొచ్చింది.

Advertisement

ఈ మధ్య జరిగిన అక్కినేని కుటుంబం వివాదంపై కూడా మహేశ్వరి స్పందించింది.  తమ కాలంలో ఇలాంటివి లేవని, ఇదొక సెలబ్రేషన్ గా మారిపోయిందని, ఒకదాన్ని పట్టుకొని లాగి లాగి నెగిటివ్ చేస్తున్నారని తెలిపింది. ఇక తాన్ రీ ఎంట్రీ గురించి కూడా మహేశ్వరీ క్లారిటీ ఇచ్చింది. అందరు ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఎప్పుడు అని అడుగుతున్నారు.. అసలు నేను ఎప్పుడు ఇండస్ట్రీని వదిలేశాను. ఇప్పటికీ నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను. సినిమానే  నాకు మొత్తం అని చెప్పుకొచ్చింది.

ఇక చివరగా అక్క శ్రీదేవి మరణం గురించి వచ్చిన పుకార్లను ఆమె కొట్టిపారేసింది. శ్రీదేవిది సహజ మరణం కాదని, ఆమెను ఎవరో కావాలనే హత్యచేశారని  వచ్చిన రూమర్స్ పై మహేశ్వరి మాట్లాడుతూ.. ”  అవన్నీ అబద్దాలు.. అక్కది సహజ మరణమే.  ఆమె అలానే బాత్ టబ్ లో పడి మృతి చెందింది” అని తెలిపింది.  ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా  మారాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×