Big Stories

Jammu Terror Attack : జమ్మూలో ఏం జరుగుతోంది ? వరుస దాడులకు కారణాలేంటి ?

Jammu Terror Attack news(Telugu news live): జమ్ము మళ్లీ నెత్తురోడుతోంది. లోయలో మళ్లీ అలజడి పెరుగుతోంది. గన్‌లు మళ్లీ గ్యాప్‌ లేకుండా గర్జిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇంతకీ జమ్మూలో ఏం జరుగుతోంది.. ? ఒక్కసారిగా ఈ వరుస దాడులు పెరగడానికి రీజన్‌ ఏంటి ?

- Advertisement -

మే 4.. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై దాడి.. IAF సోల్జర్ విక్కి పహాడే మృతి.
జూన్ 9.. రాయిసీలో భక్తుల బస్సులపై దాడి.. 9 మంది మృతి.. 42 మందికి గాయాలు.
జూన్ 11.. బడేర్‌వాహ్‌లో దాడి.. ఐదుగురు జవాన్లు, ఓ పోలీసాఫిసర్‌కు గాయాలు.
జూన్ 12.. డోడాలోని టెంపరరీ ఆపరేటింగ్‌ బేస్‌పై దాడి.. ఓస్పెషల్ ఫోర్సెస్‌ కమాండోకు తీవ్రగాయాలు.. ఓ ఉగ్రవాది మృతి.
జూన్ 26.. డోడాలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు జైషే ఇ మహ్మద్‌ టెర్రరిస్టుల ఏరివేత.
ఈ లెక్కలు మొత్తం జమ్ము కశ్మీర్‌కు సంబంధించినవి కావు. జస్ట్‌ జమ్ములో మాత్రమే ఉగ్రవాదులు సృష్టించిన నరమేధం ఇది. నిజానికి ముందు జమ్ములో ఎక్కువగా ఉగ్రదాడులు జరిగేవి. కానీ ఇప్పుడు జమ్ములో ఎక్కువగా అలజడి సృష్టిస్తున్నారు ఉగ్రవాదులు. చాలా నెలలుగా.. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంపై ఉగ్రవాదులు ఎందుకు ఫోకస్ చేశారు..?

- Advertisement -

దారుణమైన విషయం ఏమిటంటే.. ఒకానొక సమయంలో మూడు రోజుల్లో మూడు దాడులు చేశారు ఉగ్రవాదులు. దీంతో NIA రంగంలోకి దిగింది.. ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభించింది. కానీ.. ఈ దాడులు ఆగలేదు. మళ్లీ 24 గంటల తేడాతో మళ్లీ పలుచోట్ల ఉగ్రవాదుల అలజడి. గత ఆదివారం రాజౌరీలోని ఆర్మీ క్యాంప్‌పై దాడి.. ఓ సోల్జర్ మృతి. ఇది జరిగిన గంటల్లోనే కుల్గాం డిస్ట్రిక్ట్‌లో జరిగిన సపరేట్‌ ఎన్‌కౌంటర్స్‌లో ఆరుగురు టెర్రరిస్టులను మట్టుపెట్టింది ఆర్మీ. కానీ.. ఆ కాల్పుల్లో ఇద్దరు సోల్జర్స్ కూడా మృతి చెందారు. ఇది జరిగిన తర్వాత ఆర్మీ కాన్వాయ్‌పై దాడి చేశారు. ఐదుగురు జవాన్లు మృతి చెందారు.. ఆరుగురికి గాయాలయ్యాయి.

Also Read : ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి.. నలుగురు జవాన్లు మృతి..

నిజానికి ఇది చాలా సీరియస్ విషయం. ఒక్కసారిగా దాడులు ఎలా పెరిగాయి ? ఉగ్రవాదులు ఎలా సరిహద్దులను దాటి వచ్చారు ? వారికి ఎవరు షెల్టర్ ఇస్తున్నారు? స్థానికంగా సహాయం అందుతుందా ? ఆర్మీ వెహికల్స్‌ రూట్‌ మ్యాప్‌ ఎలా తెలుస్తుంది ? గెరిల్లా వార్‌ ఫేర్‌లో అంత ఎక్స్‌పర్ట్స్‌గా ఎలా మారారు ? కమాండో తరహా శిక్షణ ఎవరిచ్చారు ? అన్ని ప్రశ్నలే.. అయితే ఈ ప్రశ్నల పరంపర ఇక్కడితో ఆగడం లేదు. ఇప్పుడే ఈ దాడులు ఎందుకు చేస్తున్నారు ? ఈ దాడులతో ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ? ఇది ఏదైనా డైవర్షన్‌ ప్లానా ? ఆర్మీ అటెన్షన్‌ జమ్ముకు డైవర్ట్‌ చేసి ఇంకేదైనా పెద్దగా ప్లాన్‌ చేస్తున్నారా ? అనే ప్రశ్నలు ఇప్పుడు బుర్రను తొలిచేస్తున్నాయి.

నిజానికి ఉగ్రవాదులు రాటు తేలారు. వారిని ఉగ్రవాదులు అనేకంటే.. స్పెషల్‌ ఫోర్స్‌ కమాండో ఎంత ట్రైనింగ్‌తో ఉంటారో.. అలా ఉగ్రవాదుల వ్యూహాలు ఉన్నాయని చెబుతున్నారు ఆర్మీ అధికారులు. జంగిల్‌ వార్‌ ఫేర్‌తో పాటు అత్యాధునిక ఆయుధాలను ఉపయోగిస్తున్నట్టు గుర్తిస్తున్నారు. దాడి చేయడం వెంటనే అడవుల్లోకి పారిపోవడం.. వారిని వేటాడటానికి వచ్చిన సైనికులను ట్రాప్‌ చేసి చంపేసే ఎత్తుగడలు కనిపిస్తున్నాయి. కథువాలో జరిగిన దాడిని చూస్తే ఇది అర్థమవుతోంది. మొదట ఆర్మీ కాన్వాయ్‌లోని డ్రైవర్‌ను టార్గెట్ చేసుకున్నారు. ఆ తర్వాత వెంటనే గ్రనైడ్‌ వేశారు.. దీని నుంచి తెరుకునే లోపే కాల్పులు ప్రారంభించారు. దీంతో బలగాలకు రియాక్ట్ అయ్యే టైమ్ కూడా దొరకలేదు. ఆ వెంటనే మళ్లీ అడవుల్లోకి పారిపోయారు.

Also Read : ‘ప్రతీకారం తీర్చుకుంటాం’.. కఠువా ఉగ్రదాడిపై కేంద్రం

కాబట్టి వీరికి పాకిస్థాన్‌లో హైలెవల్‌లో ట్రైనింగ్‌ ఇచ్చినట్టు క్లియర్‌ కట్‌గా తెలిసిపోతుందంటున్నారు ఆర్మీ అధికారులు. అంతేకాదు జమ్ము కశ్మీర్‌ ప్రశాంతంగా ఉండటం దాయాది దేశానికి ఇష్టం లేనట్టు క్లియర్‌ కట్‌గా అర్థమవుతోంది. ప్రస్తుతం ఇండియా గ్రోత్ రేట్‌ రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఇండియా అన్ని విషయాల్లో ఇంకా సక్సెస్ కాలేదు. దానికి జమ్మునే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పకనే చెబుతున్నారు టెర్రరిస్ట్‌లు. అంతేకాదు జమ్ముకశ్మీర్‌లో త్వరలో ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది కేంద్రం. లేటెస్ట్‌గా ప్రధాని మోడీ లోక్‌సభలో కూడా అనౌన్స్ చేశారు. త్వరలో కశ్మీర్‌లో ఎలక్షన్స్ నిర్వహించి తీరుతామని.. ఈ విషయం ఉగ్రసంస్థలకు అస్సలు మింగుడు పడటం లేదు. అందుకే ఇంకా మేమున్నామని తమ అస్థిత్వాన్ని చాటుతున్నారు.

మరి కేంద్రం వద్ద ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి ? ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ? ఈ ప్రశ్నకు తమ వద్ద సమాధానం ఉంది కానీ.. ప్రత్యేక కారణాల వల్ల బయటికి చెప్పలేమంటున్నారు ఆర్మీ అధికారులు. అయితే రెండు విషయాలపై ఆర్మీ ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. అడవుల్లో నక్కి.. దాడులు చేస్తున్న ఉగ్రవాదులను ఏరివేయడం ఫస్ట్ చాయిస్‌ కాగా.. ఈ మధ్య యాక్టివ్‌ అయిన ఉగ్ర నెట్‌వర్క్‌ని కట్‌ చేయడం సెకండ్ చాయిస్‌లా కనిపిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News