E-Paper
Advertisement

Payal Ghosh: నేను నిద్రపోవాలంటే.. ప్రతిరోజు ఒక పెగ్ తో పాటు అవి కూడా ఉండాలి

Payal Ghosh: నేను నిద్రపోవాలంటే.. ప్రతిరోజు ఒక పెగ్ తో పాటు అవి కూడా ఉండాలి
Advertisement

Payal Ghosh: పాయల్ ఘోష్.. ఈ మధ్య ఈ పేరు బాగా వినిపిస్తుంది. సినిమాల్లో కాదు సోషల్ మీడియాలో.. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ను రోడ్డుమీదకు లాగిన ఈ బ్యూటీ.. ఇంకా సందు దొరికినప్పుడల్లా అతడు చేసిన పాపాన్ని చెప్తూ వివాదాలను కొనితెచ్చుకుంటుంది. ఈ మధ్యనే ఇర్ఫాన్ పఠాన్ వదిలేశాక శృంగారం చేయలేదని చెప్పుకొచ్చిన పాయల్.. ఇప్పుడు అనురాగ్ కశ్యప్ గురించి చెప్పుకొచ్చి మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఒక పోస్ట్ పెట్టింది.

” గత కొన్నేళ్లుగా నేను డిప్రెషన్ లో ఉంటున్నాను. అనురాగ్ కశ్యప్ నన్ను అత్యాచారం చేశాడు. కొన్నేళ్లుగా యాంటీ డిప్రసెంట్ మందులు వాడుతున్నాను. ఇప్పటికీ రాత్రిపూట ఒక గ్లాస్ వైన్, నిద్రమాత్రలు వేసుకోకపోతే నిద్రపోలేను. అనురాగ్ కశ్యప్ కు కూడా కూతురు ఉంది. ఆమె కూడా ఇలాంటి లైంగిక వేధింపులను ఎదుర్కొంటుంది” అని చెప్పుకొచ్చింది.

Advertisement

ఇక మరో పోస్ట్ లో ఇండియాలో 80%మంది ఆడవారు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, కానీ.. వారు బయటకు చెప్పుకోలకపోతున్నారని తెలిపింది. వారెందుకు బయటకు చెప్పుకోలేకపోతున్నారో కూడా తెలిపిన ఒక పేపర్ క్లిప్పింగ్ ను అభిమానులతో పంచుకుంది. ఏం చేసినా న్యాయం జరగదని మౌనంగా ఉన్నవారు కొంతమంది.. సమయం ఎక్కువ పడుతుందని చెప్పనివారు ఇంకొంతమంది.. ఇక కోర్టు బోన్ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అని భయపడి చెప్పనివారు ఇంకొందరు అంటూ చెప్పుకొచ్చింది.

ఇలాంటి తీరు మారాలని, న్యాయ వ్యవస్థ ఈ విషయంలో ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించింది. ఇప్పుడు అత్యాచారం చేసిన వారి కంటే బాధింపపడ్డ వారికే శిక్షలు వేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పాయల్ తెలుగులో ప్రయాణం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా నటించి మెప్పించింది . ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక .. ఇలా పోస్టులు పెట్టి అటెన్షన్ గ్రాబ్ చేస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×