BigTV English

Sangakkara: శ్రీలంక గల్లీ క్రికెట్‌లో సంజు శాంసన్ బ్యాట్‌లు

Sangakkara: శ్రీలంక గల్లీ క్రికెట్‌లో సంజు శాంసన్ బ్యాట్‌లు

Sanju Samson: రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ బ్యాట్లు శ్రీలంక గల్లీ క్రికెట్‌లో బౌండరీలు బాదుతున్నాయి. ఇండియా నుంచి శ్రీలంకకు సంజు శాంసన్ బ్యాట్లు ఎలా వెళ్లాయా? అనే కదా మీ డౌట్. శ్రీలంక వెటరన్ ప్లేయర్ కుమార్ సంగక్కర ద్వారా సంజు శాంసన్ బ్యాట్లు శ్రీలంకకు చేరాయి. ఇప్పుడు సంజు శాంసన్ ఇచ్చిన బ్యాట్‌లతో కుమార్ సంగక్కర ఆయన గ్రామంలో క్రికెట్ ఆడుతున్నారు. ఈ రెండు బ్యాట్లు ఇచ్చిన సంజు శాంసన్‌కు కుమార్ సంగక్కర ధన్యవాదాలు చెప్పిన వీడియో ఒకటి రాజస్తాన్ రాయల్స్ ఇన్‌స్టాలో పోస్టు చేసింది.


తన వద్ద బ్యాట్లు లేవని, రెండు బ్యాట్లు ఇచ్చి సహాయం చేసిన సంజు శాంసన్‌కు ధన్యవాదాలు చెబుతూ కుమార్ సంగక్కర సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ‘మా ఊరిలో ఆడిన క్రికెట్‌లో సంజు శాంసన్‌ ఇచ్చిన రెండు బ్యాట్లు ఉన్నాయి. నా వద్ద ఇప్పుడు ఒక్క బ్యాట్‌ కూడా లేదు. ఇలాంటి సమయంలో సంజు శాంసన్ నాకు రెండు బ్యాట్లు ఇచ్చాడు. యూజి ఒక వేళ ఈ వీడియో చూస్తున్నట్టయితే.. ఎస్‌జీ కిట్లు ఇస్తానని నువ్వు నాకు ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నాను. దాని కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నాను’ అంటూ సంగక్కర పోస్టు పెట్టారు.

Also Read: మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి


ఈ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి సంజు శాంసన్ రియాక్ట్ అయ్యారు. కుమార్ సంగక్కర నా బ్యాట్లు వాడుకుంటున్నారని, హా.. హా.. ఇది నిజంగా ఒక కల అంటూ పేర్కొన్నారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అంతర్జాతీయ ఆటగాడైన కుమార్ సంగక్కర గల్లీ క్రికెట్ ఆడటం.. అందులో భారత్‌కు చెందిన బ్యాట్‌మెన్ బ్యాట్‌లను వినియోగించడం ఆసక్తికరంగా మారింది.

కుమార్ సంగక్కర, సంజు శాంసన్ రాజస్తాన్ రాయల్స్ టీమ్‌లో మంచి భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ ఫైనల్‌కు చేరడంలో, లేటెస్ట్ సీజన్‌లో క్వాలిఫైయర్ వరకు చేరడంలో వీరిద్దరి పార్ట్‌నర్షిప్ కీలకంగా ఉన్నది.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×