BigTV English

Poonam Kaur – Allu Arjun: బన్నీ అరెస్ట్.. సంచలన ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్..!

Poonam Kaur – Allu Arjun: బన్నీ అరెస్ట్.. సంచలన ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్..!

Poonam Kaur – Allu Arjun: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో…చేసింది కొన్ని సినిమాలే అయినా భారీ పాపులారిటీ అందుకుంది పూనమ్ కౌర్ (Poonam Kaur). ఎక్కువగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan), త్రివిక్రమ్(Trivikram) లను టార్గెట్ చేస్తూ ఈమె చేసే పోస్ట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు తనను దూరం చేశారనే విధంగా ఎక్కువగా గతంలో పోస్ట్లు పెట్టిన ఈమె, ఇప్పుడు పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ లపై రివేంజ్ తీర్చుకుంటోంది అనేలా ట్వీట్స్ పెడుతూ ఉంటుంది. ఇక నిన్న మొన్నటి వరకు నేరుగా త్రివిక్రమ్ పేరు మెన్షన్ చేసినా సరే త్రివిక్రమ్ నోరు మెదపకపోయేసరికి అసలు కథ ఏంటో తెలుసుకోవాలని నెటిజన్స్ కూడా రకరకాల కామెంట్లు చేశారు. కానీ దీనికి ఎటువంటి సమాధానం తెలియలేదు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్(Allu Arjun) ను అరెస్టు చేయడంపై తాజాగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.


అల్లు అర్జున్ అరెస్ట్.. పూనమ్ ట్వీట్ వైరల్..

పుష్ప -2 సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద బెనిఫిట్ షో వేశారు. అయితే అక్కడికి అల్లు అర్జున్ సినిమా చూడడానికి వస్తే ఆయనను చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు ఎగబడ్డారు. ఆ తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. ఆ కేసులోనే ఇప్పుడు ఆయనను పోలీసులు అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీనిపై రియాక్ట్ అయ్యింది పూనమ్ కౌర్. పూనమ్ కౌర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. “పబ్లిక్ ర్యాలీలు సహా పలు ఘటనలలో చాలామంది అమాయకులు తొక్కిసలాలలో చనిపోయారు. ఇప్పుడు ఆ లిస్టు కోసం నేను చూస్తున్నాను. ఇటీవల ఒక యంగ్ యాక్టర్ కూడా ర్యాలీలో ఊపిరాడక కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయారు. వారసత్వంతో కాకుండా స్వయంకృషితో ఎదిగిన స్టార్ అల్లు అర్జున్” అంటూ పూనమ్ ట్వీట్ చేసింది.మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న పూనమ్ కౌర్ అల్లు అర్జున్ పై చేసిన ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.


చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి బారులు తీరుతున్న సెలబ్రిటీలు..

ఇకపోతే ఈ కేసులో నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి భారీ భద్రత నడుమ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇక అల్లు అర్జున్ తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పుడు ఆ పిటిషన్ నాంపల్లి కోర్టు లో విచారణకు రాగా.. 14 రోజులు రిమాండ్ విధించారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ 14 రోజుల పాటు జైలు జీవితం గడపబోతున్నారని తెలిసి పలువురు సెలబ్రిటీలు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి బారులు తీరుతున్నారు. అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం అన్యాయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ అరెస్టుపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×