BigTV English

Vijay – Trisha : గోవాలో అడ్డంగా దొరికిన ప్రేమ పక్షులు.. ఇదిగో ప్రూఫ్…

Vijay – Trisha : గోవాలో అడ్డంగా దొరికిన ప్రేమ పక్షులు.. ఇదిగో ప్రూఫ్…

Vijay Thalapathy – Trisha : తమిళ స్టార్ విజయ్ దళపతి గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస హిట్ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. రీసెంట్ గా ది గోట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి టాక్ ను అందుకుంది. సినిమాల పరంగా బిజీగా ఉన్న విజయ్ ఇటీవలే కొత్త పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన రాజకీయ లాంచింగ్ రోజు భారీగా జనాలు తరలి వచ్చి ఆయనకు మద్దతు తెలిపారు. ఇక ప్రస్తుతం ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే సోషల్ మీడియాలో ఈయన పై ఓ వార్త షికారు చేస్తుంది..


విజయ్, త్రిషలు రిలేషన్లో ఉన్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలా అనుకోవడానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నారు. వీరిద్దరూ జంటగా కలిసి ట్రిప్ లకు వెళ్తూ అక్కడ దిగిన ఫోటోలను త్రిష సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దాంతో వీరిద్దరూ లవ్ లో ఉన్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ మధ్య కలిసి కనిపించడంతో పాటుగా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని కన్ఫార్మ్ చేసుకున్నారు. ఇక తాజాగా మరోసారి వీరిద్దరూ కలిసి కీర్తి సురేష్ పెళ్లికి వెళ్లడంతో మరోసారి ఈ వార్తలు ఊపందుకున్నాయి.

విజయ్, నటి త్రిష క్రిష్ణన్ మధ్య డేటింగ్ రూమర్లు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరూ ఎన్నో సినిమాలలో కలిసి నటించగా.. వీరిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతోందని ఎన్నో రోజుల నుంచి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో..వీరు గోవాలో జరిగిన కీర్తి సురేష్-ఆంటోనీ తట్టిల్ వివాహ వేడుకకు కలిసి వెళ్లినట్లు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దాంతో వీరిద్దరూ కలిసి వెళ్లారని ఫిక్స్ అవుతున్నారు.. విజయ్, త్రిష క్రిష్ణన్ ఒక ప్రైవేట్ ప్లైట్‌లో గోవాకు ప్రయాణించారు అనేది గుసగుసలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు ..విమానంలో వారితో పాటు మరికొందరు అతిథులు ఉన్నట్లు క్రూ లిస్ట్ ద్వారా వెల్లడైంది. ఇక ప్రస్తుతం వీరిద్దరూ ఎయిర్ పోర్ట్ లో కలిసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వైరల్ అవుతున్న వీడియోలో విజయ్ విజయ్ బ్లూ స్ట్రైప్ షర్ట్‌, బ్లూ జీన్స్ లో కనిపించగా, త్రిష వైట్ టీ-షర్ట్ ధరించింది.


ఈ ఏడాది డిసెంబర్ 12న కీర్తి సురేష్ తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్‌ను గోవాలో వివాహమాడింది. ఈ వేడుకలో విజయ్, త్రిషతో పాటు మాళవిక మోహనన్ తదితరులు పాల్గొన్నారు.. త్రిష కీర్తి సురేష్ కు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు. ఇక వీరి సినిమాల విషయానికొస్తే.. విజయ్ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు. ఇక త్రిష మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×