BigTV English

Samyukta Menon: వరుస విజయాలతో దూసుకుపోతున్న పాప్ కార్న్ బ్యూటీ.. నేడు సంయుక్త మీనన్ నేడు పుట్టినరోజు

Samyukta Menon: వరుస విజయాలతో దూసుకుపోతున్న పాప్ కార్న్ బ్యూటీ.. నేడు సంయుక్త మీనన్ నేడు పుట్టినరోజు

Actress Samyukta menon birth day September 11: మలయాళ సినీ రంగం నుంచి టాలీవుడ్ కు వచ్చి ఇక్కడ కూడా అద్భుత విజయాలను సొంతం చేసుకుంటున్న హీరోయిన్ల లిస్టు లో ఇప్పుడు సంయుక్త మీనన్ కూడా చేరింది. టాలీవుడ్ లో వరుస విజయాలను అందుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతోంది. మలయాళంలో వచ్చిన పాప్ కార్న్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. 2016లో ఆ మూవీ రిలీజయింది. అప్పుడు సంయుక్త వయసు 20 సంవత్సరాలు మాత్రమే. తర్వాత మలయాళం, తమిళ చిత్రాలలో నటిస్తుండగానే తెలుగులో తొలిసారిగా భీమ్లా నాయక్ లో రానా పక్కన నటించింది. ఆ సినిమాలో సంయుక్త మీనన్ కనిపించేది తక్కువే అయినా నటనకు స్కోప్ ఉన్న పాత్రను చేసింది. దీనితో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది. బింబిసారలోనూ కథానాయిక పాత్ర చేసింది. ఆ మూవీ కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ అయింది. కళ్యాణ్ రామ్ హీరోగా మరో మూవీ కూడా చేసింది. డెవిల్..ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అంటూ వచ్చిన ఆ మూవీ కూడా కమర్షియల్ గా హిట్ రేంజ్ ని అందుకుంది. నేడు సంయుక్త మీనన్ పుట్టినరోజు.


విరూపాక్షలో విశ్వరూపం

గత ఏడాది సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష మూవీలో నటనలో తన విశ్వరూపం చూపింది. ఈ మూవీలో హీరో కన్నా ఎక్కువ కథంతా హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది. ముఖ్యంగా దెయ్యం ఆవహించే సన్నివేశంలో అప్పటి చంద్రముఖి మూవీలో జ్యోతికను తలపించింది. ప్రతి ఒక్కరూ సంయుక్త నటనకు ముగ్ధులయ్యారు. ప్రస్తుతం మలయాళంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు సంయుక్త మీనన్. ఇటీవల ఓ మీడియా సమావేశంలో బహుభాషల్లో నటించేటప్పుడు ఏ భాషలో మీకు సౌకర్యంగా ఉంటుంది అని ఓ విలేఖరి ప్రశ్నించగా తన మాతృ భాషలో నటించేటప్పుడు మేకప్ అవసరం అంతగా ఉండదని.. అదే తెలుగు భాష సినిమాలో నటించేటప్పుడు మేకప్ కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అంటారు. తన వ్యక్తిగతంగా మేకప్ కు వ్యతిరేకం కాదని.. అయితే మేకప్ వేసుకుని నటించేటప్పుడు మాత్రం శరీరంపై ఏదో అతుక్కుని ఉంటుందన్న ఫీలింగ్ ఉంటుందని వివరణ ఇచ్చారు సంయుక్త మీనన్.


ఎవరా టాలీవుడ్ హీరో?
సంయుక్త తన పేరులో మీనన్ తగిలించుకోవడం తనకు ఇష్టం లేదని.. కేవలం సంయుక్త అని పిలిస్తే చాలని అంటారు. ఇలా చివర్లో తోకలు తగిలించుకుని మన కులం, మతం అంటూ మనలను మనమే దూరం చేసుకుంటున్నాం అన్నారు. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు సంయుక్త. అందరి హీరోయిన్ల మాదిరిగానే ఈ కేరళ కుట్టిపైనా గాసిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంయుక్త ప్రస్తుతం ఎవరో టాలీవుడ్ హీరోతో డేటింగ్ లో ఉన్నారని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్లు వస్తున్నాయి. కాకపోతే ఆ హీరోకి ఇప్పటికే పెళ్లయింది. ఈ వార్తలో నిజానిజాలు ఏమిటో తెలియవు కానీ.. ఇలాంటి గాసిప్స్ ఇండస్ట్రీలో ఎదుగుతున్న కొద్దీ సహజమే అంటూ తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు సంయుక్త. అవకాశం వస్తే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తానంటున్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే తన జీవిత ధ్యేయం చెబుతున్నారు. ప్రస్తుతం సంయుక్తపై సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షల మెసేజ్ లు వెల్లువెత్తుతున్నాయి. నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు చిత్రంలో కథానాయికగా నటిస్తోంది సంయుక్త. ఆమె బర్త్ డే సందర్భంగా నిర్మాతలు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ బ్యూటిపుల్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. హీరో నిఖిల్ కూడా సంయుక్తకు బర్త్ డే విషెస్ తెలిపారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×