BigTV English

Bigg Boss 8 Telugu Promo: రేషన్ కావాలంటే ‘లెమన్ పిజ్జా’ ఆట ఆడాల్సిందే.. నాగ మణికంఠపై అతిపెద్ద బాధ్యత, ఛాలెంజ్‌లో చీఫ్‌ను గెలిపించగలిగాడా?

Bigg Boss 8 Telugu Promo: రేషన్ కావాలంటే ‘లెమన్ పిజ్జా’ ఆట ఆడాల్సిందే.. నాగ మణికంఠపై అతిపెద్ద బాధ్యత, ఛాలెంజ్‌లో చీఫ్‌ను గెలిపించగలిగాడా?

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అవ్వకముందే ఇందులో అన్‌లిమిటెడ్ ఫన్ ఉంటుందని నాగార్జున మాటిచ్చారు. అంతే కాకుండా సీజన్ ప్రారంభమయిన మొదటిరోజే కేవలం ఫన్ మాత్రమే కాదు.. అన్నీ అన్‌లిమిటెడ్ అని బిగ్ బాస్ వివరించారు. అలా ప్రస్తుతం బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్‌కు రేషన్ కూడా అన్‌లిమిటెడ్ అయ్యింది. మొదటివారం ఎలాంటి టాస్కులు లేకుండా రేషన్‌ను సంపాదించుకున్నారు కంటెస్టెంట్స్. కానీ రెండోవారం నుండి రేషన్ కావాలంటే టాస్కులు మొదలు అనే విషయం అర్థమయ్యింది. తాజాగా విడుదలయిన ప్రోమోలో తమ టీమ్‌లోని కంటెస్టెంట్స్‌కు రేషన్ కావాలంటే చీఫ్స్.. ఆటలు ఆడి గెలవాలని బిగ్ బాస్ వివరించారు. దానికోసం చీఫ్స్.. తమ టీమ్‌మేట్స్‌తో కలిసి ఆట మొదలుపెట్టారు.


యాక్షన్‌లో చీఫ్స్

‘‘యష్మీ, నైనికా, నిఖిల్.. మీ రేషన్‌ను మీరు గెలుచుకోవడానికి యాక్షన్ ఏరియాలో ఒక సూపర్ మార్కెట్ పెట్టబడి ఉంది. ఈ వారానికి సరిపడా ఆహారాన్ని తీసుకురావడం చీఫ్ యొక్క బాధ్యత’’ అని టాస్క్ గురించి బిగ్ బాస్ వివరించడంతో ఈ ప్రోమో మొదలవుతుంది. యష్మీ టీమ్‌లో ఎక్కువమంది సభ్యులు ఉండడంతో మొదటి బజర్ మోగగానే తను రేషన్ తీసుకురావడానికి వెళ్లింది. ఇక రెండో బజర్‌కు నైనికా, మూడో బజర్‌కు నిఖిల్.. యాక్షన్ ఏరియాలోకి వెళ్లి తమకు ఇచ్చిన బుట్టల్లో రేషన్ తీసుకున్నారు. అయితే కథ అంతటితో ముగిసిపోలేదు. బుట్టల్లో వేసుకున్న రేషన్ తమకు దక్కాలంటే చీఫ్స్‌తో పాటు కంటెస్టెంట్స్ మరో ఆట ఆడాలని బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టారు.


Also Read: విష్ణుప్రియాను విన్నర్ చేయనున్న సోనియా.. అభయ్, నిఖిల్‌తో కలిసి నీఛమైన ముచ్చట్లు

టచ్ అవ్వకూడదు

వరుసగా బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్‌లను గెలిస్తేనే వారు సేకరించిన రేషన్ వారి చేతికి వస్తుంది. అలా బిగ్ బాస్ ఇచ్చిన మొదటి ఛాలెంజ్.. ‘లెమన్ పిజ్జా’. ప్రస్తుతం హౌజ్‌లో ముగ్గురు చీఫ్స్ ఉండగా.. వారికంటూ మూడు టీమ్స్ ఉన్నాయి. ప్రతీ టీమ్ నుండి ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చి ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలి. పజిల్‌లో మూడు నిమ్మకాయలు ఉంటాయి. ఆ పజిల్‌ను కింద టచ్ అవ్వకుండా తాళ్లతో పట్టుకొని ఆ నిమ్మకాయలను పజిల్ నుండి బయటికి తీసుకురావాలి. ప్రస్తుతం నిఖిల్ టీమ్‌లో నాగ మణికంఠ మాత్రమే ఉన్నాడు కాబట్టి వారిద్దరూ కలిసి లెమన్ పిజ్జా ఛాలెంజ్ కోసం సిద్ధమయ్యారు. నైనికా టీమ్ నుండి తనతో పాటు నబీల్.. రంగంలోకి దిగాడు. యష్మీ టీమ్ నుండి పృథ్వి, అభయ్ వచ్చారు. ఈ ఛాలెంజ్‌కు శేఖర్ భాషా సంచాలకుడిగా వ్యవహరించాడు.

మణికంఠ సపోర్ట్

లెమన్ పిజ్జా గేమ్‌లో నైనికా టీమ్, యష్మీ టీమ్.. ఒక్కొక్కసారి పజిల్‌ను కింద టచ్ చేశాయి కాబట్టి ఆటను మళ్లీ మొదటినుండి మొదలుపెట్టాల్సి వచ్చింది. అయితే ఈ ఛాలెంజ్‌లో ఎవరు విన్ అయ్యారో అన్న విషయాన్ని మాత్రం ప్రోమోలో చూపించలేదు. నిఖిల్ టీమ్‌లో నాగ మణికంఠ మాత్రమే మిగిలినా.. ఆ ఒక్కడు తన టీమ్ రేషన్ కోసం రంగంలోకి దిగాడు. ఇప్పటికే యష్మీకు తన టీమ్‌లో ఎక్కువమంది సభ్యులు ఉన్నారనే ధైర్యం ఏర్పడింది. అది ఇతర టీమ్స్‌కు, చీఫ్స్‌కు నచ్చకపోవడంతో ఎలాగైన తనను ఓడించాలని ఫిక్స్ అయ్యారు.

Related News

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Big Stories

×