E-Paper
Advertisement

Brazil Bodybuilder Death: ఊబకాయంపై గెలిచాడు.. వేగంగా బాడిబిల్డింగ్ చేసి ప్రాణాలు విడిచాడు!

Brazil Bodybuilder Death: ఊబకాయంపై గెలిచాడు.. వేగంగా బాడిబిల్డింగ్ చేసి ప్రాణాలు విడిచాడు!
Advertisement

Brazil Bodybuilder Death| పరుగులు తీసే జీవన శైలిలో ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కేవలం రుచికోసం తినే వారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. దాని వల్ల వీరంతా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా వేగంగా బరువు పెరిగి ఊబకాయంతో బాధపడుతూ ఉంటారు. కానీ కొద్ది మంది మాత్రమే ఈ ఉబకాయంతో సంకల్ప బలంతో పోరాడుతారు. ఈ క్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో ఇన్స్‌పిరేష్నల్ వెయిల్ లాస్ స్టోరీస్ చాలా మంది చేస్తున్నారు.

అలా ఊబకాయ సమస్యతో బాధపడుతున్న ఒక 14 ఏళ్ల టీనేజర్ బరువు తగ్గాలని శ్రమించాడు. అయితే ఆ ప్రయత్నంలో అతనికి బాడీబిల్డింగ్ పై మక్కువ కలిగింది. దీంతో అతను అందంగా కనిపించాలని, శరీరంగా ఫిట్ గా ఉండాలని రాత్రింబవుళ్లు కష్టపడ్డాడు. అయితే ఈ ప్రయత్నాల్లో తప్పుడు మార్గాన్ని అనుసరించాడు. ఫలితంగా కేవలం 19 ఏళ్లకే మరణించాడు.

Advertisement

వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్ దేశంలో దక్షిణ రాష్ట్రమైన శాంట క్యాటరీనాకు చెందిన మాథ్యూస్ పవ్ లాక్ అనే 19 ఏళ్ల టీనేజర్ వారం రోజుల క్రితం తన ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించాడు. మాథ్యూస్ ని అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మరిణించాడని వైద్యులు ధృవీకరించారు. మాథ్యూస్ నిద్రలో ఉండగా అతనికి గుండె పోటు రావడంతో మరణించాడని డాక్టర్లు స్పష్టం చేశారు.

అయితే సరిగ్గా అయిదేళ్ల క్రితం మాథ్యూస్ పవ్ లాక్ వయసు 14 ఏళ్లు ఉన్నప్పుడు అతను ఊబకాయంతో బాధపడేవాడు. దీంతో అతను బరువు తగ్గడానికి ప్రతి రోజు వ్యాయామం చేసేవాడు. మితిమీరి తినడం మానేశాడు. తన కిష్టమైన భోజనం కూడా తినకుండా కఠినంగా బరువు తగ్గాలని ప్రయత్నం చేశాడు. ఫలితంగా రెండేళ్ల లోనే అతని శరీర బరువు సాధారణ స్థాయికి చేరింది. ఆ తరువాత మాథ్యూస్ తన చుట్టూ ఉన్న బాడీ బిల్డర్లను చూసి వారిలా అందమైన శరీరాకృతి పొందాలని ఆశపడ్డాడు.

Advertisement

Also Read: శాఖాహారుల ఆరోగ్యానికి మంచి ఒమెగా 3 ఫుడ్స్ ఇవే..

ఈ క్రమంలో బాడీబిల్డింగ్ శిక్షణ మొదలుపెట్టాడు. 2023లో శాంట క్యాటరీనాలోని U23 బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని విజయం సాధించాడు. దీంతో అతడికి మిస్టర్ బ్లూమెన్యూ అని బిరుదు కూడా లభించింది. సోషల్ మీడియాలో అతని లైఫ్ స్టోరీ, వెయిట్ లాస్ జర్నీ కథ విపరీతంగా వైరల్ అయింది. అయితే మాథ్యూస్ పవ్ లాక్ వారం రోజుల క్రితం చనిపోవడంతో అతని కోచ్, స్నేహితులు, కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు.

మాథ్యూస్ పవ్ లాక్ బాడీబిల్డింగ్ చేసి త్వరగా కండలు పెంచాలని అనబాలిక్ స్టిరాయిడ్స్ తీసుకున్నాడని అందువల్లే అతని గుండె బలహీనంగా మారిందని వైద్యులు తెలిపారు. కేవలం 19 ఏళ్ల చిన్న వయసులో అంత మంచి బాడీ బిల్డర్ చనిపోవడంతో అతని కోచ్ లుకాస్ చెగాట్టి స్పందించారు. ”మాథ్యూస్ పవ్ లాక్ కు మంచి భవిష్యత్తు ఉందని నేను ఆలోచించే వాడిని, అతని శరీరాకృతి చాలా తక్కువ బాడీ బిల్డర్స్ కు మాత్రమే నాచురుల్ గా లభిస్తుంది. ఇంకా చాలా బాడీ బిల్డింగ్ పోటీలు అతను గెలుస్తాడని నేను భావించాను. కానీ భగవంతుడు మరోలా నిర్ణయించాడు. మాథ్యూస్ చనిపోవడంతో మేము మంచి బాడీ బిల్డర్ ని కోల్పోయాం. ముఖ్యంగా నేను మంచి శిష్యుడిని కోల్పోయాను ,” అని కోచ్ చెగాట్టి బాధపడుతూ చెప్పారు.

స్టిరాయిడ్స్ తీసుకొని బాడీబిల్డర్స్ చనిపోవడంతో ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా బ్రిజెలియన్ ఫిట్ నెస్ కోచ్ జోనల్ ఫిల్ హో 29 ఏళ్ల కే మరణించాడు. ఆస్ట్రేలియాలో కూడా 22 ఏళ్ల బాడీ బిల్డర్ స్టిరాయిడ్స్ వాడకంతో గుండెపోటు వల్ల మరణించాడు. మరోవైపు వేగంగా బరువు తగ్గాలని ప్రయత్నించి చైనాకు చెందిన ఒక మహిళా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ చిహువా కూడా 22 ఏళ్లకు మరణించింది.

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×