BigTV English

Sonia Singh: 2 నెలల్లోనే 2 లగ్జరీ కార్లు… సోనియమ్మ… నీకు ఇంత డబ్బు ఎక్కడిది?

Sonia Singh: 2 నెలల్లోనే 2 లగ్జరీ కార్లు… సోనియమ్మ… నీకు ఇంత డబ్బు ఎక్కడిది?

Sonia Singh:విరూపాక్ష బ్యూటీ సోనియా సింగ్ (Sonia Singh) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. చబ్బీ లుక్స్ తో విరూపాక్ష మూవీలో ఎంతో మందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా విరూపాక్ష మూవీతో హీరోయిన్ సంయుక్త మీనన్ (Samyuktha Menon) కంటే సోనియా సింగ్ ఎక్కువ ఫేమస్ అయ్యింది. అయితే అలాంటి సోనియా సింగ్ సినిమాల్లోకి రాకముందు పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేసి సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. అలా యూట్యూబర్ గా తన లైఫ్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలలో రాణిస్తోంది. ఇదిలా ఉండగా.. సోనియా సింగ్ తాజాగా చేసిన పనికి చాలామంది నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అదేంటంటే సోనియా సింగ్ రెండు నెలల వ్యవధిలోనే రెండు కాస్ట్లీ కార్లు కొని అందరికీ షాక్ ఇచ్చింది.


2 నెలల్లోనే 2 లగ్జరీ కార్లు..

రీసెంట్ గా మార్చి లో మెర్సిడెజ్ బెంజ్ కారు ని కొన్న సోనియా సింగ్ తాజాగా మరో కాస్ట్లీ కార్ కొని టెంపుల్ దగ్గర పూజ చేయించుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.అంతేకాదు ఈ వీడియోని పోస్ట్ చేస్తూ “ఆ దేవుడు ప్లాన్ ఎప్పటికీ గొప్పగానే ఉంటుంది. ప్రయాణం కష్టంగా ఉన్నా కానీ ఆ దేవున్ని ఎన్నటికీ మర్చిపోవద్దు..ఆ దేవుడు మనకోసం ఏదో గొప్పగా చేస్తున్నాడు అని ఎదురు చూడాలి” అంటూ పూజ చేస్తున్న వీడియోతోపాటు ఈ విషయాన్ని షేర్ చేసుకుంది. దీంతో చాలామంది నెటిజన్లు సోనియా సింగ్ కి ఇన్ని కోట్ల డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి..రెండు నెలల గ్యాప్ లో రెండు ఖరీదైన కార్లు కొన్నది అంటే ఈమె రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు..ఇక మార్చి లో సోనియా సింగ్ కొన్న ‘మెర్సిడెజ్ బెంజ్’ కారు విలువ దాదాపు రూ.60 లక్షల నుండి రూ. 80 లక్షల వరకు ఉంటుంది. ఇక తాజాగా సోనియా కొన్న కారు ‘బెంజ్4 మ్యాటిక్’ అని తెలుస్తోంది. దీని ధర దాదాపు రూ.2కోట్ల వరకు ఉంటుంది. అయితే ఇంత తక్కువ టైమ్ లో ఇంత ఖరీదైన కార్లని సోనియాసింగ్ ఎలా కొన్నది? అనే ప్రశ్న చాలా మంది నెటిజన్ల మైండ్లో తలెత్తుతోంది.


నెటిజన్స్ ప్రశ్నకు సోనియా సమాధానమేది..?

అంతేకాదు ఈమె పోస్ట్ చేసిన వీడియోకి కూడా నెటిజన్స్ షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. ఇన్ని డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అంటూ కామెంట్లు పెడుతూ సోనియా సింగ్ ని ప్రశ్నిస్తున్నారు. ఇక గత కొద్దిరోజుల నుండి చాలామంది సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి కదా.. అలా సోనియా సింగ్ కూడా ఏదైనా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి కోట్లు సంపాదించిందా అనే అనుమానం కూడా సోషల్ మీడియా జనాల్లో తలెత్తుతోంది. మరి సోషల్ మీడియా జనాలు అడిగిన ప్రశ్నలకు సోనియా సింగ్ ఏ విధంగా ఆన్సర్ ఇస్తుందో చూడాలి.

ALSO READ:Vijay Deverakonda : విజయ్ దేవరకొండ సినిమాలో విలన్‌గా యాంగ్రీ మ్యాన్… సెకండ్ ఇన్నింగ్స్‌లో సెకండ్ మూవీ.?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×