BigTV English
Advertisement

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ సినిమాలో విలన్‌గా యాంగ్రీ మ్యాన్… సెకండ్ ఇన్నింగ్స్‌లో సెకండ్ మూవీ.?

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ సినిమాలో విలన్‌గా యాంగ్రీ మ్యాన్… సెకండ్ ఇన్నింగ్స్‌లో సెకండ్ మూవీ.?

Vijay Deverakonda :రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి (Gautam thinnanuri ) దర్శకత్వంలో ‘కింగ్ డం’ సినిమా చేస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు (Dil Raju) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం రౌడీ జనార్థన్ (Rowdy Janardhan). ఈ సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు విజయ్ దేవరకొండ. ఈ చిత్రానికి ‘రాజావారు రాణీ గారు’ దర్శకుడు రవి కిరణ్ కోలా (Ravi Kiran kola) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా హీరో రాజశేఖర్(Hero Rajasekhar) నటించబోతున్నట్లు సమాచారం. ఇటీవలే రాజశేఖర్ విలన్ లుక్ పై ఫోటోషూట్ నిర్వహించగా.. చిత్ర బృందాన్ని అన్ని విధాలా ఆ లుక్కు సంతృప్తి పరిచిందని, దీనికి రాజశేఖర్ కి కూడా మంచి పారితోషకం ఆఫర్ చేశారని సమాచారం.


రౌడీ జనార్థన్ మూవీలో ప్రతినాయకుడిగా రాజశేఖర్..

ఇకపోతే రీ ఎంట్రీ లో అందులోనూ రెండవ సినిమాలో విలన్ గా నటించే అవకాశం ఉంటే మామూలుగా ఉండదని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే విజయ్ దేవరకొండ కి రాజశేఖర్ తోడైతే కచ్చితంగా తెరపై ఈ కాంబో అదిరిపోతుందని నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక రాజశేఖర్ విషయానికి వస్తే.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆయనకు క్యారెక్టర్ ఆర్టిస్టు, విలన్ పాత్రలు బాగానే వస్తున్నాయి. కానీ రాజశేఖర్ ఒప్పుకోవడం లేదు. అలా ఇప్పటికే ఎన్నో ఆఫర్లు ఆయన వదులుకున్నారు.
ఇకపోతే వచ్చిన అవకాశాన్ని వదులుకుంటూపోతే భవిష్యత్తులో మళ్ళీ అవకాశాలు వస్తాయో రాదో అనే అనుమానంతో ఈ పాత్ర ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ స్టోరీ కథ రాజశేఖర్ కి నచ్చడంతోనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.


రౌడీ జనార్థన్ మూవీ విశేషాలు..

ఇక రౌడీ జనార్ధన్ మూవీ విషయానికొస్తే.. ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ మూవీగా రాబోతోంది. ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు సినిమా లో రష్మిక మందన్నను చిత్ర బృందం ఫైనలైజ్ చేయలేదు. ఒకవేళ రష్మిక గనుక నటిస్తే మళ్లీ వీరిద్దరికి ఇది హ్యాట్రిక్ కాంబో అవుతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలు వచ్చాయి. అందులో గీతా గోవిందం భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మళ్లీ రౌడీ జనార్ధన్ మూవీ వచ్చి సక్సెస్ అందుకుంటే ఇక ఈ కాంబోకి తెరపై తిరుగుండదు అని చెప్పవచ్చు. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈయన ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా మారారు. కానీ ఈయన కెరియర్ కు మంచి గుర్తింపు అందించిన చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. నాని (Nani) హీరోగా వచ్చిన ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మంచి ఫామ్ లోకి వచ్చారు. ఇక సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయారు విజయ్ దేవరకొండ.

ALSO READ:Suma: మూగబోయిన సుమా.. 10 రోజులుగా అలాంటి సమస్యతో..!

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×