E-Paper
Advertisement

Spirit Movie : ప్రభాస్ స్పిరిట్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన న్యూ నేషనల్ క్రష్… ఇంతకీ ఈ బ్యూటీ ఎవరంటే.?

Spirit Movie : ప్రభాస్ స్పిరిట్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన న్యూ నేషనల్ క్రష్… ఇంతకీ ఈ బ్యూటీ ఎవరంటే.?
Advertisement

Spirit Movie: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్, సందీప్ రెడ్డివంగా కాంబో లో వస్తున్న సినిమా స్పిరిట్. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి కాగా, ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులపై మూవీ టీం ఫోకస్ పెట్టింది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు దర్శకుడు సందీప్ ఏర్పాట్లు చేస్తున్నాడు. అందులో భాగంగా హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో మూవీ టీం నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ఇందులో హీరోయిన్ ఎవరా అంటూ, ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టైం లో, చిత్ర బృందం ఈ సినిమాలో హీరోయిన్ ని ప్రకటించింది. ఆ వివరాలు చూద్దాం..

ప్రభాస్ స్పిరిట్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన త్రిప్తి డిమ్రీ..

Advertisement

ప్రభాస్ మూవీ స్పిరిట్ లో హీరోయిన్ గా, టాలీవుడ్,బాలీవుడ్  భామలలో ఎవరైతే బాగుంటుంది అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న టైం లో వారి అంచనాలకు దీటుగా ఇందులో హీరోయిన్ గా నటించే అవకాశం తృప్తి డిమ్రి కి ఇచ్చారు దర్శకులు. తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు సందీప్ స్వయంగా ప్రకటించారు. స్పిరిట్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా తృప్తి డిమ్రి పేరును తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషలలో ఆమె పేరును పోస్ట్ చేశారు. దాదాపు తొమ్మిది భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. చైనీస్, జపనీస్ కొరియన్ భాషలలో హీరోయిన్ పేరు ప్రకటించడంతో ఈ సినిమా 9 భాషలో రిలీజ్ అవుతుందని అర్థమవుతుంది.

 ఇప్పుడు ప్రభాస్ తో యానిమల్ హీరోయిన్ ..

Advertisement

సందీప్ రెడ్డివంగా గత చిత్రం యానిమల్ లో ఈమె కీలక పాత్రలో నటించారు. దానికి కొనసాగింపుగా రాబోయే యానిమల్ పార్కులోను ఈ భామ నటించనుంది. ఇక ఇప్పుడు స్పిరిట్ లోను తృప్తి డిమ్రి హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇప్పటికే తృప్తి డిమ్రి బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తున్నారు. యానిమల్ సినిమాలో తన అందాలను ఆరబోసి బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ భామ. ఇప్పుడు తెలుగులో ప్రభాస్ సరసన నటించడం ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.

పాన్ వరల్డ్ మూవీ గా ..స్పిరిట్ 

ఇక తృప్తి డిమ్రి కి యానిమల్ సినిమాతో అవకాశాలు క్యూ కట్టాయి. మొదట ఈ మూవీలో దీపికా పడుకొనేను, రుక్మిణి వసంత, మృనాల్, అని ఇలా కొంతమంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి, అయితే చివరికి సందీప్ రెడ్డి తృప్తి డిమ్రిసెలెక్ట్ చేశారు. పాన్ ఇండియా సినిమాల కాకుండా పాన్ వరల్డ్ సినిమాల ఈ మూవీని రూపొందించబోతున్నారు. అలాంటి మూవీలో తృప్తి చాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈమె  ధడక్ 2, విశాల్ భరద్వాజ్ మూవీలోనూ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత స్పిరిట్ లో నటించే అవకాశం ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×