Manchu Manoj: ప్రస్తుతం ఫామ్ లో లేడు కానీ ఒకప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకుంటాడు అని పేరు సాధించుకున్నాడు మంచు మనోజ్. మంచు కుటుంబ సభ్యులలో మంచు మనోజ్ పై చాలామందికి ఒకప్పటివరకు మంచి అభిప్రాయం ఉండేది. మెగా అభిమానులుకు కూడా కొంతమంది మంచు మనోజ్ ను ప్రేమించేవారు. వరుసగా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు తీసిన మనోజ్ కొంతకాలం తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఒక్కడే మిగిలాడు సినిమా తర్వాత ఒక సినిమా కూడా చేయలేదు. ఇక ప్రస్తుతం విజయ్ కనకమేడల దర్శకత్వంలో భైరవం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మనోజ్ తో పాటు ఈ సినిమాలో నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
కన్నప్ప పై కామెంట్స్
మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. మంచు ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు ఆల్మోస్ట్ ఆడియన్స్ చూడటం మానేశారు అని అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయం మంచు ఫ్యామిలీ కూడా అర్థమైనట్లు ఉంది. అందుకే ఇతర భాషల్లో మంచి పేరు సాధించిన నటులను ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేశారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రుద్ర అనే పాత్రలో కనిపిస్తున్నాడు. ప్రభాస్ వలన కూడా ఈ సినిమాకి వెళ్లే ఆడియన్స్ ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రెండు టీజర్లు విడుదలయ్యాయి. ఒక టీజర్ లో మంచు విష్ణు శివయ్య అనే అరిచే డైలాగ్ ట్రోల్ కి గురి అయింది. అదే డైలాగును భైరవం ఆడియో లాంచ్ లో మంచు మనోజ్ కూడా ప్రస్తావించారు.
అన్నయ్యకు సారీ
మంచు ఫ్యామిలీకి సంబంధించి కొన్ని రోజుల నుంచి వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మంచు మనోజ్ కన్నప్ప సినిమా గురించి చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు. నేను అలా అనడం కరెక్ట్ కాదు. ఒక సినిమా కోసం చాలామంది కష్టపడతారు. ఒక వ్యక్తి మీద ద్వేషంతో అలా అనడం తప్పు. ఆరోజు ఏదో ఎమోషన్ లో శివయ్య అన్నాను.. సినిమా అంటే ఒక్కరిదే కాదు, అందులో ప్రభాస్, మోహన్ లాల్ కూడా ఉన్నారు.. అందరినీ క్షమించమని అడుగుతున్న. కన్నప్ప సినిమా మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నా అంటూ తెలిపారు. ఏదేమైనా ఒకరకంగా తన అన్నయ్య సినిమా హిట్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే మంచు మనోజ్ అలా చెప్పారు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Pawan Kalyan: తెలుగు పరిశ్రమ పెద్దలకు పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్