BigTV English
Advertisement

Varalaxmi Sarathkumar with Would-Be: ప్రియుడితో నటి వరలక్ష్మి శరత్ కుమార్.. పెళ్లికి ముందే ఏంటా పని..? వీడియో వైరల్

Varalaxmi Sarathkumar with Would-Be: ప్రియుడితో నటి వరలక్ష్మి శరత్ కుమార్.. పెళ్లికి ముందే ఏంటా పని..? వీడియో వైరల్

Varalaxmi Sarathkumar Massaging to Would-Be Nikolai Sachdev: నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఈ పేరు గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. మలయాళ స్టార్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అనేక సినిమాలలో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగులో తన నటనతో ఎంతో మంది సినీ ప్రియుల్ని అలరించింది. ఎక్కువగా నెగిటివ్ పాత్రలు పోషించి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.


సినిమాలలో ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తుంది ఈ ముద్దుగుమ్ము. ఎన్నో సినిమాలలో విలన్ భార్యగా.. అలాగే హీరోకి అక్కగా లేదా చెల్లిగా నటించి ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసింది. ప్రస్తుతం ఈ నటి తెలుగులో పలు సినిమాలతో బిజీ బిజీగా ఉంది. గతంలో రవితేజ నటించిన క్రాక్, బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి వంటి సినిమాలలో నటించి ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

అలాగే సమంత నటించిన యశోద మూవీలో కూడా నెగిటివ్ పాత్రలో నటించి.. తన అందం, యాక్టింగ్‌తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఇటీవలే శ్రీకాంత్ నటించిన కోట బొమ్మాళి సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్‌గా నటించి దుమ్ము దులిపేసింది. అలాగే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘హనుమాన్’ సినిమాలోనూ నటించి మెప్పించింది.


Also Read: స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల కలకలం.. జరిపించింది ఇతడేనా..?

ఈ మూవీలో హీరో తేజా సజ్జకి అక్క పాత్రలో నటించిన అదరగొట్టేసింది. ఎమోషనల్ సీన్లతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమా అనంతరం మరికొన్ని లేడీ ఓరియేంటెడ్ మూవీలలో నటిస్తోంది. అయితే ఒక్క తెలుగులోనే కాకుండా, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లో కూడా ఈ బ్యూటీ మంచి అవకాశాలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్‌ నిక్లాయ్ సచ్‌దేవ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ముంబైకి చెందిన బడా వ్యాపారవేత్త, గ్యాలరిస్ట్ నిక్లాయ్ సచ్‌దేవ్ – వరలక్ష్మి నిశ్చితార్థం మార్చి 1న జరిగింది. కాగా వీరిద్దరూ గత 14 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ జంట నిశ్చితార్థం అయినప్పటి నుంచి ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది.

?utm_source=ig_web_copy_link">

తాజాగా వీరికి సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. వరలక్ష్మి తన కాబోయే భర్త నిక్లాయ్ సచ్‌దేయ్ తలకు ఆయిల్ పెడుతూ మసాజ్ చేస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలు కామెంట్లు పెడుతున్నారు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×