E-Paper
Advertisement

Adipurush: ‘హనుమంతుడు దేవుడు కాదు’.. ఆదిపురుష్ రైటర్ మరో కాంట్రవర్సీ..

Adipurush: ‘హనుమంతుడు దేవుడు కాదు’.. ఆదిపురుష్ రైటర్ మరో కాంట్రవర్సీ..
Advertisement
Adipurush: ‘హనుమంతుడు దేవుడు కాదు’.. ఆదిపురుష్ రైటర్ మరో కాంట్రవర్సీ..

Adipurush: పాన్ ఇండియా సినిమాగా విడుదలయిన ‘ఆదిపురుష్’కు ప్రశంసలు ఏ రేంజ్‌లో వస్తున్నాయో.. కాంట్రవర్సీలు కూడా అదే రేంజ్‌లో వస్తున్నాయి. సినిమా బాగానే ఉంది అని కొందరు ప్రశంసిస్తుంటే.. ఒక పురాణాన్ని తెరకెక్కించే విధానం తెలియదా అంటూ మూవీ టీమ్‌ను విమర్శిస్తున్న వారు మరికొందరు. ఇక ఈ కాంట్రవర్సీల మధ్య ఆదిపురుష్ రైటర్ ఇస్తున్న స్టేట్‌మెంట్లు మరింత అగ్గిని రగిలిస్తున్నాయి.

రామాయాణాన్ని తెరకెక్కిస్తున్నాం, అందరు గర్వపడేలా చేస్తామని మూవీ టీమ్.. ప్రేక్షకులకు మాటిచ్చింది. కానీ వారు చెప్పినదానికి, సినిమా ఔట్‌పుట్‌కు సంబంధం లేదని ప్రేక్షకులు సినిమా విడుదలయిన మొదటిరోజు నుండే విమర్శించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా రావణుడి పాత్ర, లంక, గ్రాఫిక్స్.. ఇవన్నీ చాలా ఘోరంగా ఉన్నాయని, సినిమా బడ్జెట్‌కు ఔట్‌పుట్ మ్యాచ్ అవ్వడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆదిపురుష్ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్.. ఈ కాంట్రవర్సీల మధ్యలో పలు ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారు. ఆ ఇంటర్వ్యూలలో ఆయన ఇస్తున్న స్టేట్‌మెంట్ ప్రేక్షకులకు మరింత కోపాన్ని తెప్పిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో అసలు తాము తెరకెక్కించింది రామాయణం కాదని, రామాయణంలోని వనవాసాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించామని చెప్పడం సంచలనం సృష్టించింది. తాజాగా అలాంటి మరొక స్టేట్‌మెంట్‌ను మనోజ్ పాస్ చేశారు.

ఈసారి మనోజ్ ముంతాషిర్.. ఏకంగా హనుమంతుడు దేవుడు కాదు అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. రాముడిపై చూపించిన భక్తి వల్ల హనుమంతుడిని దేవుడు అనుకుంటున్నాం కానీ నిజానికి ఆయన దేవుడు కాదని అన్నారు. దీంతో ప్రేక్షకులను మరింత కోపంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే మనోజ్ రాసిన డైలాగులు పలువురికి నచ్చక.. బెదిరింపులను కూడా ఎదుర్కుంటుండగా.. తన కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్‌ను మాత్రం పక్కన పెట్టడం లేదు. దీనిపై మూవీ టీమ్ మాత్రం ఇంకా ఏం స్పందన ఇవ్వలేదు. 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×