BigTV English

Rachitha Mahalakshmi: వేధిస్తున్న భర్త..! పోలీసులను ఆశ్రయించిన నటి..

Rachitha Mahalakshmi: వేధిస్తున్న భర్త..! పోలీసులను ఆశ్రయించిన నటి..

Rachitha Mahalakshmi: వేధిస్తున్న భర్త..! పోలీసులను ఆశ్రయించిన నటి..



Rachitha Mahalakshmi: ఈరోజుల్లో ఎంటర్‌టైన్మెంట్ రంగంలో జరుగుతున్న పెళ్లిళ్లు ఎక్కువకాలం నిలబడడం లేదు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీలో హిట్ అవుతున్న కపుల్స్.. ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ విషయంలో మాత్రం పూర్తిగా ఫ్లాప్ అవుతున్నారు. అంతే కాకుండా కొన్ని జంటలు అయితే ఒకరిని ఒకరు వేధించుకోవడం మొదలుపెడుతున్నారు. తాజాగా ఒక సీరియల్ నటి కూడా తన భర్త వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. వీరిద్దరూ సినీ పరిశ్రమలో పనిచేస్తున్నవారే. ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి చేరుకున్నారు.

‘ప్రీవోమ్ సంతిప్పోమ్’ అనే తమిళ సీరియల్.. చాలాకాలం పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఇందులో హీరోయిన్‌గా నటించిన రజిత మహాలక్ష్మి తొలి సీరియల్‌తోనే అందరినీ ఆకట్టుకుంది. ఈ సీరియల్ సెట్‌లోనే తను దినేశ్ గోపాలసామిని కలిసింది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వీరు కూడా ఒకరిని ఒకరు ఇష్టపడి సీరియల్ టైమ్‌లోనే పెళ్లి కూడా చేసుకున్నారు. వీరి వివాహం 2015లో జరగగా.. అప్పటినుండి ఇప్పటివరకు ఏదో ఒక విధంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వస్తూనే ఉన్నాయి. తాజాగా అవి తారాస్థాయికి చేరుకున్నాయి.

రజిత కెరీర్ కారణంగా తనకు, దినేశ్‌కు మధ్య గొడవలు వస్తున్నా కూడా తన కెరీర్‌ను ఏ మాత్రం పక్కన పెట్టలేదు. పెళ్లి తర్వాత కూడా బుల్లితెరపై సక్సెస్‌ఫుల్‌గా తన జర్నీని కొనసాగించింది. తమిళ బిగ్‌బాస్‌లో కూడా పార్టిసిపేట్ చేసింది. రజిత కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగడం వల్లే దినేశ్‌కు, తనకు గొడవలు పెరిగాయని సన్నిహితులు చెప్తున్నారు. అప్పటినుండి దినేశ్.. రజితను వేధించడం మొదలుపెట్టారు. బెదిరిస్తూ మెసేజ్‌లు పంపించేవాడు. వేరే దారి లేక రజిత తాజాగా పోలీసులను ఆశ్రయించి భర్తపై ఫిర్యాదు చేసింది. 

అసభ్యకరంగా మెసేజ్‌లు పంపిస్తున్నాడంటూ, బెదిరింపులకు గురిచేస్తున్నాడంటూ భర్తపై రజిత చెన్నై మంగాడులోని ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు దినేశ్‌తో జీవించాలని లేదని, విడాకులు ఇప్పించాలని కోరింది. ఆరోపణల్లో నిజానిజాలు తెలుసుకోవడం కోసం పోలీసులు రజిత, దినేశ్.. ఇద్దరినీ ప్రశ్నించారు. విచారణలో కూడా తనకు రజిత అంటే ఇష్టమని, వారిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు తప్పా పెద్దగా సమస్యలు ఏమీ లేవని దినేశ్ చెప్పాడు. 

ఒకవేళ రజిత చేసిన ఆరోపణలు నిజమయితే.. దినేశ్‌పై యాక్షన్ తీసుకోవడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. సినీ రంగంలోని సమాచారం ప్రకారం జీజీ అనే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ వల్లే రజితకు, దినేశ్‌కు మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని తెలుస్తోంది. దినేశ్ తనను ఇబ్బంది పెడుతున్నాడంటూ జీజీ పోలీసులకు గతంలో ఫిర్యాదు కూడా చేసింది. ప్రస్తుతం రజిత, దినేశ్‌కు మధ్య జరుగుతున్న గొడవలు చూస్తుంటే ఇదే ముఖ్య కారణమని అనిపిస్తుందంటూ సన్నిహితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×