BigTV English

AP EAMCET : ఏపీ ఎంసెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్ లోడ్ చేసుకోండిలా..

AP EAMCET : ఏపీ ఎంసెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్ లోడ్ చేసుకోండిలా..

AP EAMCET 2024 Hall Tickets: ఏపీ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి.వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచారు. ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. AP EAMCET పరీక్షను ఈ సారి జవహార్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనిర్సిటీ నిర్వహిస్తోంది.


AP EAMCET పరీక్షల్లో ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు మే 18 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. అయితే అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు మే 16, 17 తేదీల్లో జరగనున్నాయి. ఈ పరీక్షలను రెండు సెషన్ లలో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రకటించిన తేదీల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ మొదటి సెషన్ పరీక్షలు నిర్వహించనుండగా.. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకూ రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు రాసే అభ్యర్థులు AP EAMCET hall tickets 2024 https://cets.apsche.ap.gov.in/ వెట్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

AP EAMCET 2024 ప్రవేశ పరీక్ష ద్వారా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ (డైరీ టెక్నాలజీ) బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ) బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) వంటి కోర్సులకు ప్రవేశం పొందవచ్చు. అంతే కాకుండా ఫార్మసీలో డిప్లొమా కోసం బీఎస్సీ( అగ్రికల్చర్) బీఎస్సీ ( హార్టికల్చర్ ) BVSc,AH,BAFc, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. ఆన్ లైన్ లో ఈ పరీక్షను 3 గంటల పాటు నిర్వహిస్తారు.


Also Read: పవన్ గురించి నాలుగు ముక్కల్లో చిరంజీవి, స్పెషల్ వీడియో

AP EAMCET పరీక్ష మొత్తం 160 మార్కులు ఉండగా.. అభ్యర్థులు 160 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. రాష్ట్రంలో 47 ఆన్ లైన్ సెంటర్లతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ లలో ఒక్కో సెంటర్ లో పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడు ఇంజనీరింగ్ విబాగంలో 2,35,417 మంది, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో 69,445 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా రెండు విభాగాలకు 892 మంది అప్లై చేసుకున్నారు.

 

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×