BigTV English

Janhvi Kapoor with Nani: నానితో జాన్వి.. ఆర్ఆర్ఆర్ హీరోలు అయిపోయారు.. ఇక ఇప్పుడు దసరా వంతు..?

Janhvi Kapoor with Nani: నానితో జాన్వి.. ఆర్ఆర్ఆర్ హీరోలు అయిపోయారు.. ఇక ఇప్పుడు దసరా వంతు..?

Janhvi Kapoor Romance with Hero Nani: అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్.. తన కెరీర్ ను చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో అమ్మడు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ పట్టేసి.. గట్టి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. హిందీలో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ చాలా ఆలోచించి.. మంచి కథలను ఎంచుకొని టాలీవుడ్ లో అడుగు పెట్టడానికి సిద్దమవుతున్న తరుణంలోనే దేవర సినిమా ఛాన్స్ వచ్చింది.


ఇక మొదటి నుంచి ఎన్టీఆర్ తోనే సినిమా చేయాలని రోజు దేవుడుకు ప్రార్ధనలు కూడా చేసిందంట. ఇక జాన్వీ ప్రార్థనలు విన్న దేవుడు మొదటి తెలుగు అవకాశమే ఎన్టీఆర్ తో ఇచ్చాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. ఇందులో జాన్వీ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27 న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే జాన్వీ.. చరణ్ సినిమాలో నటించే ఛాన్స్ పట్టేసింది.

బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న RC16 ఈ ఏడాది స్టార్ట్ అయిన విషయం తెల్సిందే. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో చిరు – శ్రీదేవి వారసులు.. ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే జాన్వీ.. ముచ్చటగా మూడో సినిమాను కూడా లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో దసరా సినిమాతో నానికి హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. వీరిద్దరూ మరోసారి కలవబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.


Also Read: Amaran: దీపావళీకి వస్తున్న మేజర్ ముకుంద్ వరదరాజన్.. అమరన్ రిలీజ్ డేట్ ఫిక్స్

దసరా లాంటి కథనే నాని కోసం శ్రీకాంత్ సిద్ధం చేస్తున్నాడు అంట. ఈ చిత్రంలో నాని సరసన జాన్వీ కపూర్ నటిస్తోందని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే జాన్వీతో చర్చలు జరిగాయని, కథ నచ్చడంతో ఆమె వెంటనే ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే అమ్మడు రెండు సినిమాలను లైన్లో పెట్టి కెరీర్ ను బాగానే ప్లాన్ చేసుకుంటుంది. మరి ఈ సినిమాలతో జాన్వీ ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×