E-Paper
Advertisement

Amaran: దీపావళీకి వస్తున్న మేజర్ ముకుంద్ వరదరాజన్.. అమరన్ రిలీజ్ డేట్ ఫిక్స్

Amaran: దీపావళీకి వస్తున్న మేజర్ ముకుంద్ వరదరాజన్.. అమరన్ రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement

Amaran: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం అమరన్. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ & సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో మేజర్ ముకుంద్ వరదరాజన్ గా శివ కార్తికేయన్ నటిస్తున్నాడు. తెలుగువారికి కూడా శివ కార్తికేయన్ సుపరిచితుడుగా మారాడు. ఆయన నటించిన ప్రతి చిత్రం తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు రాజ్ కుమార్.

Advertisement

ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ ఎదురుచూపులకు ఒక ఫుల్ స్టాప్ పడింది. తాజాగా అమరన్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మొదట ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుందని ప్రకటించారు. కానీ, ఈ సినిమా ఇప్పుడు దీపావళీ కానుకగా అమరన్ అక్టోబర్ 31 న రిలీజ్ అవ్వనున్నట్లు మేకర్స్ తెలుపుతూ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు.

ఇక ఈ పోస్టర్ లో శివ కార్తికేయన్ ఒంటినిండా రక్తంతో సీరియస్ లుక్ లో కనిపించాడు. శివ కార్తికేయన్ వెనుక ఇండియా జెండాను చూపించారు. పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీపావళీకే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమా కనుక లైన్లో ఉంటే అమరన్.. గేమ్ ఛేంజర్ తో తలపడతాడో..? తప్పుకుంటాడో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×