BigTV English

Samantha: మళ్ళీ సెలైన్ బాటిల్ తో బెడ్ పై సమంత.. ఆందోళనలో ఫ్యాన్స్..!

Samantha: మళ్ళీ సెలైన్ బాటిల్ తో బెడ్ పై సమంత.. ఆందోళనలో ఫ్యాన్స్..!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఈమధ్య కాలంలో ఎక్కువగా హిందీలో వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది. ఒకప్పుడు సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ఇప్పుడు బాలీవుడ్లో పాగా వేసే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే వరుస వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతోంది. బాలీవుడ్ లో చివరిగా ‘సిటాడెల్ – హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఇప్పుడు మళ్లీ రాజ్ (Raj) దర్శకత్వంలో ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్ తో పాటు తన సొంత బ్యానర్ లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో కూడా నటిస్తోంది.


మళ్ళీ సెలైన్..

ఇకపోతే ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే.. మరొకవైపు సమంత నిర్మాతగా కూడా మారిన విషయం తెలిసిందే. “ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్” బ్యానర్ పై కొత్త టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు ఈ మూవీ బ్యానర్ పై తొలి ప్రాజెక్టు ‘శుభం’ సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభమైనట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ..ఒక పోస్ట్ కూడా షేర్ చేసింది. అయితే అందులో ఈ భామ హాస్పిటల్ బెడ్ పై సెలైన్ ఎక్కించుకుంటున్న ఫోటో కూడా షేర్ చేసింది. దీనితో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్, అభిమానులు సమంతాకు ఏమైంది అంటూ ఆందోళన చెందుతున్నారు.


సమంతకు ప్రేమ కలిసి రావడం లేదా?

ఇక సమంత వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. మొదట హీరో సిద్ధార్థ్ (Siddharth) ను ప్రేమించింది. కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత నాగచైతన్య (Naga Chaitanya)ను ప్రేమించింది సమంత. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన ఈ జంట.. 2017లో పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట.. ఎంతో మందికి ఆదర్శంగా కూడా నిలిచింది. క్యూట్ కపుల్ గా పేరు కూడా దక్కించుకుంది. కానీ అంతలోనే విడాకులు తీసుకొని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. 2021 అక్టోబర్ 2వ తేదీన సోషల్ మీడియా ఖాతా ద్వారా విడాకులు ప్రకటించి, అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది ఈ జంట.

Vishwak Sen: హీరో విశ్వక్ ఇంట చోరీ… ఎన్ని కిలోల బంగారం మిస్సయిందంటే?

డైరెక్టర్ రాజ్ తో డేటింగ్.. నిజమేనా..?

ఇకపోతే వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఇప్పటికీ కూడా తెలియదనే చెప్పాలి. ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇకపోతే వీరిద్దరూ విడిపోయిన తర్వాత నాగచైతన్య యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల (Shobhita dhulipala) తో రెండేళ్లపాటు ప్రేమాయణం కొనసాగించి, గత ఏడాది డిసెంబర్లో ఆమె మెడలో మూడు ముళ్ళు వేశారు.ఇక ప్రస్తుతం కొత్త భార్యతో సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు నాగచైతన్య. అటు సమంత మాత్రం ఇంకా సింగిల్గానే కెరియర్ కొనసాగిస్తోంది. కానీ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ (Director Raj) తో ఈమె డేటింగ్ చేస్తోందనే వార్తలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఎక్కడా కూడా సమంతా స్పందించడం లేదు. కానీ ఎక్కడికి వెళ్తే అక్కడికి తనతో పాటు ఆ డైరెక్టర్ ని కూడా తీసుకు వెళుతూ ఉండడంపై పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక త్వరలోనే ఈ విషయంపై కూడా క్లారిటీ వస్తుందని నెటిజెన్స్ తమ అభిప్రాయంగా వ్యక్తపరుస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×