Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen)ఇంట ఈరోజు ఉదయం భారీ దొంగతనం జరిగినట్లు సమాచారం.ఈ విషయం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ ఫిలింనగర్ లో ఉన్న నివాసంలోకి ఆదివారం తెల్లవారుజామున ఒక దుండగుడు చొరబడ్డారట . చేతికందిన సొత్తు దోచుకుని పరారైనట్లు సమాచారం. ఇక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు దుండగుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. ఇకపోతే విశ్వక్ సేన్ కుటుంబం అంతా కూడా ఒకే ఇంట్లో ఉంటోంది. విశ్వక్ సేన్ సోదరి వన్మయి బెడ్ రూమ్ మూడో అంతస్తులు ఉంటుంది. ఇక తెల్లవారుజామున ఆమె గదిలో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. అనుమానం వచ్చిన వన్మయి వెంటనే రూమ్ లోని అల్మారాలను పరిశీలించగా.. అక్కడ ఉండాల్సిన బంగారు ఆభరణాలు కాస్త మాయం అయ్యాయట. దీంతో దొంగతనం జరిగినట్లు గుర్తించిన ఆమె వెంటనే ఈ విషయాన్ని తన తండ్రికి తెలియజేసింది. ఆయన కూడా ఆలస్యం చేయకుండా ఫిలింనగర్లో ఉన్న పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం.
విశ్వక్ సేన్ ఇంత దొంగతనం..
ఇకపోతే ఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ప్రాథమిక ఆధారాలు, వేలిముద్రలు కూడా సేకరించారు. అనంతరం ఇంటి పరిసరాలలోని సీసీటీవీ ఫుటేజ్ లను కూడా పరిశీలించగా.. తెల్లవారుజామున 5:50 నిమిషాల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి బైకు మీద వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి ఇంటి గేటు తీసుకొని, డైరెక్ట్ గా మూడో అంతస్తుకు వెళ్లాడని, వెనుక డోర్ నుంచి వన్మయి బెడ్ రూమ్ లోకి వెళ్లి , అల్మారా లో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ దొంగతనం కేవలం 20 నిమిషాల్లోనే జరిగినట్లు పోలీసులు కూడా చెబుతున్నారు
అనుమానం రేకెత్తిస్తున్న దొంగతనం..
ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. ఒక వ్యక్తి ధైర్యంగా గేటు తీసుకొని, నేరుగా మూడో అంతస్తుకు వెళ్లడం.. దర్జాగా మళ్లీ బయటకు వెళ్లిపోవడం చూస్తుంటే.. ఇది ఎవరో తెలిసిన వారు ఈ పని చేసి ఉంటారని అందరూ భావిస్తున్నారు. లేదా ఈ పరిసరాలను బాగా పరిశీలించిన వారే ఇలా దొంగతనం చేసే ఆస్కారం ఉంది అని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఎవరు ఈ దొంగతనం చేశారో తెలియదు కానీ త్వరలోనే ఆ దొంగలను పట్టుకుంటామని పోలీసులు కూడా తెలిపారు.
ఏ ఏ వస్తువులు చోరీకి గురయ్యాయంటే..
ఇకపోతే ఈ చోరీలో విలువైన రెండు డైమండ్ రింగులు పోయినట్టు తెలుస్తోంది. ఈ చోరీకి గురైన ఆభరణాల విలువ సుమారుగా రూ.2.2 లక్షలు ఉంటుందని, ఆ ఫిర్యాదులో విశ్వక్ సేన్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మొత్తానికి అయితే రెండు డైమండ్ ఉంగరాలు చోరీకి గురి కావడంతో అటు ఫిలిం సర్కిల్స్ వారు కూడా అప్రమత్తమవుతున్నారు. ఇంత పగడ్బందీ ఉన్నా కూడా నేరుగా దొంగలు ఇలా దొంగతనం చేయడం పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు మరి దీనిపై హీరో విశ్వక్ సేన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.