E-Paper
Advertisement

Akhil’s Agent Movie OTT: ఓటిటీలో ఏజెంట్.. మాకు నమ్మకం లేదు దొర..!

Akhil’s Agent Movie OTT: ఓటిటీలో ఏజెంట్.. మాకు నమ్మకం లేదు దొర..!
Advertisement
Agent Movie OTT Release Date
Agent Movie OTT Release Date

Akhil’s Agent Movie OTT Release Date Fixed: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏజెంట్. గతేడాది ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామ్ బ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాను 85 కోట్లతో తెరకెక్కించగా.. అందులో కేవలం పది శాతం కలెక్షన్స్ కూడా ఏజెంట్ రాబట్టలేకపోయింది. అఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ పరాజయంగా మిగిలిపోయింది.

ఇక ఈ సినిమా ఓటిటీలో రావడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఏజెంట్ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటీలోకి వస్తుందా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏజెంట్ ఓటిటీ హక్కులు ఇప్పటికే సోనీ లివ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని వివాదాల కారణంగా ఏజెంట్ ఓటిటీలో స్ట్రీమింగ్ కావడం లేదు. ఇప్పటికే ఎన్నోసార్లు స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు కానీ, సినిమా స్ట్రీమింగ్ కాలేదు. దీంతో ఈ సినిమా ఓటిటీలో అసలు రాదు అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

Advertisement

Also Read: Kalki2898AD: ఓరి మీ దుంపతెగ.. సడెన్ గా చూసి అఫిషియల్ అనుకున్నాం కదరా..

ఇక ఈ నేపథ్యంలోనే నిన్న అఖిల్ పుట్టినరోజు కావడంతో ఏజెంట్ మేకర్స్ అఖిల్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట్ కింద అభిమానులు ఏజెంట్ సినిమా ఓటీపీలో ఎప్పుడు వస్తుంది.. త్వరగా విడుదల చేయండి అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు. దాంతో నిర్మాత అనిల్ సుంకర ఆ కామెంట్స్ కు స్పందిస్తూ “ఇప్పటికే రెండుసార్లు చెప్పాను. ఏజెంట్ ఓటిటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ దక్కించుకుంది. అతి త్వరలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది” అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక దీంతో కొంతమంది అభిమానులు ఇలాంటివి ఎన్నో రోజుల నుంచి చెప్తున్నారు.. అసలు ఈ సినిమా ఓటిటీలో వస్తుందని మాకు నమ్మకం లేదు దొర అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈసారైనా ఏజెంట్ ఓటిటీలో వస్తుందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×