BigTV English

Sree Vishnu New Movie: గ్యాప్ ఇవ్వు అన్నా.. కొద్దిగా గ్యాప్ ఇవ్వు.. శ్రీ విష్ణు కొత్త మూవీ ప్రారంభం!

Sree Vishnu New Movie: గ్యాప్ ఇవ్వు అన్నా.. కొద్దిగా గ్యాప్ ఇవ్వు.. శ్రీ విష్ణు కొత్త మూవీ ప్రారంభం!
Sree Vishnu - Dil Raju
Sree Vishnu – Dil Raju

Sree Vishnu New Movie Pooja Ceremony: టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ఈమధ్య వరుస సినిమాలతో బిజీగా మారాడు. సినిమాలను లైన్లో పెట్టడమే కాకుండా మంచి మంచి కథలను ఎంచుకొని వరుస విజయాలను కూడా అందుకుంటున్నాడు. గత ఏడాది సామజవరగమన అంటూ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ తో వచ్చి మంచి హిట్ అందుకున్న ఈ హీరో.. ఈ ఏడాది ఓం భీమ్ బుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది. ఇక ఇప్పుడు శ్రీవిష్ణు హ్యాట్రిక్ కోసం గట్టి ప్లాన్ వేశాడు.


నేడు ఉగాది పండగ వేళ శ్రీవిష్ణు మరో కొత్త సినిమాను పట్టాలెక్కించాడు. శ్రీవిష్ణు 19వ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. జానకిరామ్ మారెళ్ళ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. సామజవరగమన చిత్రానికి కథను అందించిన భాను భోగవరపునే ఈ సినిమాకు కూడా కథను అందించాడు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్, విజిల్ వర్తీ ఫిల్మ్స్ మరియు కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Also Read: Ntr – War 2: ఎన్టీఆర్ నాన్నగా జగపతి బాబు.. క్లారిటీ వచ్చేసిందిగా.. వీడియో వైరల్


ఇక ఈ పూజా కార్యక్రమంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అధినేత నవీన్ యెర్నేని స్క్రిప్టును అందించగా.. నిర్మాత దిల్ రాజు క్లాక్ కొట్టి షూటింగు ప్రారంభించాడు. డైరెక్టర్ అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. తొలిషాట్ కు దర్శకుడు వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక వరుస సినిమాలతో విష్ణు ఎడతెరిపి లేకుండా కనిపిస్తుంటే.. అభిమానులు అన్నా.. కొద్దిగా గ్యాప్ ఇవ్వన్నా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో శ్రీవిష్ణు హ్యాట్రిక్ అందుకుంటాడేమో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×