E-Paper
Advertisement

Aishwarya Rai: బాలకృష్ణ కాళ్లకు ఐశ్వర్య రాయ్ సమస్కారం.. సౌత్, నార్త్ కాంట్రవర్సీకి బ్రేక్ పడినట్టేనా!

Aishwarya Rai: బాలకృష్ణ కాళ్లకు ఐశ్వర్య రాయ్ సమస్కారం.. సౌత్, నార్త్ కాంట్రవర్సీకి బ్రేక్ పడినట్టేనా!
Advertisement

Aishwarya Rai At IIFA 2024: ఇటీవల అబుభాబిలో ఐఫా అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా అన్నీ ఇండస్ట్రీల నుండి ఆర్టిస్టులు, సెలబ్రిటీలు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. హీరోహీరోయిన్లు గ్రాండ్‌గా రెడీ అయ్యి.. వారి పర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ కూడా చేశారు. తెలుగులో ‘దసరా’ సినిమా అవార్డుల పంట పండించగా.. తమిళంలో ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమాకు ఎక్కువగా అవార్డులు వచ్చాయి. అందులో హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్య రాయ్‌కు ఉత్తమ నటిగా ఐఫా అవార్డ్ దక్కింది. ఆ అవార్డును అనౌన్స్ చేయడం కోసం, అది తన చేతికి అందించడం కోసం బాలకృష్ణ స్టేజ్‌పైకి వచ్చారు. అప్పుడు ఐశ్వర్య చేసిన పని చూసి ప్రేక్షకులు ఐశ్వర్యపోయారు.

అభిమానుల ప్రశంసలు

Advertisement

ఉత్తమ నటి అవార్డ్ తీసుకోవడానికి స్టేజ్‌పైకి వచ్చిన ఐశ్వర్య రాయ్.. బాలకృష్ణ కాళ్లకు నమస్కరించింది. అది చూసి బాలయ్య ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అవ్వడంతో పాటు ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కూడా. ఐశ్వర్య రాయ్ అంటే పేరు కాదు.. అదొక బ్రాండ్ అని ప్రేక్షకులు అంటుంటారు. అలాంటి ఐశ్వర్య.. తాను ఒక స్టార్ హీరోయిన్ అనే విషయాన్ని పక్కన పెట్టి, తనకు ఉన్న ఫేమ్‌ను మర్చిపోయి బాలయ్య కాళ్లకు నమస్కరించడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా ఈ ఘటన వల్ల బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఐశ్వర్య ఫ్యాన్స్ కూడా గర్వంగా ఫీలవుతున్నారు. పెద్ద స్టార్ అయినా కూడా సంస్కారం మర్చిపోలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటివి చూస్తే సౌత్, నార్త్ అనే కాంట్రవర్సీలు ఇక లేవేమో అని అనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: 

Advertisement

నెగిటివ్ షేడ్స్

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రమే ‘పొన్నియిన్ సెల్వన్’. అది ఒక భాగంగా కాకుండా రెండు భాగాలుగా విడుదలయ్యి ఆడియన్స్‌ను అలరించింది. తెలుగులో యావరేజ్ టాక్ అందుకున్నా కూడా తమిళంలో ఈ సినిమాలు హిట్ అయ్యాయి. ముఖ్యంగా ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ 1కంటే పార్ట్ 2కే ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. అందులో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఐశ్వర్య రాయ్ నటించింది. ఈ సినిమాల్లో నందిని అనే పాత్రలో తను కనిపించింది. కెరీర్ మొదట్లో పలు తమిళ చిత్రాల్లో నటించింది ఐశ్వర్య రాయ్.. మళ్లీ చాలాకాలం తర్వాత ‘పొన్నియిన్ సెల్వన్’ ఫిల్మ్ సిరీస్‌తోనే తమిళ ప్రేక్షకులను పలకరించింది.

మంచి కమ్ బ్యాక్

ఐశ్వర్య రాయ్ నటించిన రెండు తమిళ చిత్రాలు కూడా మణిరత్నం దర్శకత్వంలో చేసినవే అవ్వడం విశేషం. ముఖ్యంగా ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా మరోసారి తనను సౌత్ ప్రేక్షకులకు దగ్గర చేసింది. అభిషేక్ బచ్చన్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు చాలావరకు దూరమయ్యింది ఐశ్వర్య. అప్పుడప్పుడు పలు చిత్రాల్లో నటించినా.. తన ప్రతీ సినిమా సినిమాకు గ్యాప్ మాత్రం చాలానే ఉంటోంది. ఇలాంటి సమయంలోనే ‘పొన్నియిన్ సెల్వన్’లో నందిని పాత్ర ఐశ్వర్యకు కోలీవుడ్‌లో మంచి కమ్ బ్యాక్‌గా నిలిచింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×