BigTV English

Bigg Boss 8 Telugu: సోనియా అడల్డ్ రేటెడ్ కామెడీ, నిఖిల్‌ను అవమానించిన విష్ణుప్రియా.. ఇచ్చిపడేసిన నాగార్జున

Bigg Boss 8 Telugu: సోనియా అడల్డ్ రేటెడ్ కామెడీ, నిఖిల్‌ను అవమానించిన విష్ణుప్రియా.. ఇచ్చిపడేసిన నాగార్జున

Bigg Boss 8 Telugu Latest Updates: మామూలుగా బిగ్ బాస్ షో అనగానే ప్రతీ వీకెండ్ నాగార్జున వస్తారు. కంటెస్టెంట్స్ మధ్య జరిగిన గొడవల గురించి మాట్లాడతారు. ప్రేక్షకులు వారి గురించి ఎలా ఫీల్ అవుతున్నారో చెప్తారు. వాటికి తగిన సలహాలు ఇస్తారు. ఒకవేళ ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య మనస్పర్థలు ఉంటే వాటికి పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. కానీ బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అయిన తర్వాత ఇప్పటికి మూడు వీకెండ్స్ గడిచాయి. కానీ ఏ ఒక్క వీకెండ్ కూడా ఈ వీకెండ్ అంత ఇంట్రెస్టింగ్‌గా లేదని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ముఖ్యంగా సోనియా, పృథ్వి, నిఖిల్‌కు ఇచ్చిపడేశారు నాగార్జున. అంత చెప్పినా కూడా ఆ ముగ్గురు వైఖరీ ఏం మారేలాగా అనిపించట్లేదు.


ఆ ఉద్దేశ్యం కాదు

ఈవారం నామినేషన్స్‌లో యష్మీ, సోనియా మధ్య పెద్ద గొడవే జరిగింది. అందులో నిఖిల్, పృథ్విలను ఆయుధాలుగా వాడుతున్నావని యష్మీ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అది విన్న సోనియా.. నువ్వు పృథ్వి, నిఖిల్‌ను మాత్రమే చూస్తావు అని రివర్స్ అయ్యింది. ఆ వీడియోను శనివారం ఎపిసోడ్‌లో వారికి చూపించారు నాగార్జున. విష్ణుప్రియా సరదాగా ఒక మాట అన్నందుకే తనను అడల్ట్ రేటెడ్ కామెడీ అని తిట్టిన సోనియా.. అలా అన్నప్పుడు తప్పు అనిపించలేదా అని అడిగారు. దీంతో తన ఉద్దేశ్యం అది కాదంటూ కారణాలు చెప్పింది సోనియా. పృథ్వి, నిఖిల్ కూడా ఈ విషయంపై ఏమనుకుంటున్నారని అడగగా.. సోనియా ఉద్ధేశ్యం అది కాదని తనకే సపోర్ట్ ఇచ్చారు.


Also Read: నబీల్ హీరో, నిఖిల్ జీరో.. డైరెక్ట్ డేంజర్‌లో పడిన మణికంఠ

తప్పు ఒప్పుకోరు

సోనియా, పృథ్వి, నిఖిల్ ఒకే మాటపై ఉండడంతో ప్రేరణకు నవ్వొచ్చింది. వాళ్లు కళ్లారా చూసినా, అదే నిజమని తెలిసినా వాళ్లు ఒప్పుకోరు, ముగ్గురు ఒకే మాట మీద ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రేరణ మాత్రమే కాదు.. చూసిన ప్రేక్షకులకు కూడా వీరి ప్రవర్తన చూస్తే అదే అనిపించింది. అలా ఆ విషయంపై నాగార్జున మాట్లాడడం కూడా మంచి విషయమే అని అనుకున్నారు. ఆ తర్వాత విష్ణుప్రియాకు సంబంధించిన ఒక వీడియో చూపించారు నాగ్. అందులో తను నిఖిల్ గురించి హేళన చేస్తూ మాట్లాడింది. నిఖిల్ బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని, చీర కట్టుకొని కూర్చుంటే కరెక్ట్ అని చెప్పుకొచ్చింది. దానిపై నాగార్జున సీరియస్ అయ్యారు. దీంతో అలా మాట్లాడడం వల్ల హర్ట్ అయిన అందరికీ విష్ణుప్రియా సారీ చెప్పింది.

బ్రేక్‌లో గొడవ

ఒకరోజు కంటెస్టెంట్స్ అంతా గార్డెన్ ఏరియాలో కూర్చొని ఉండగా మణికంఠను ఇన్‌డైరెక్ట్‌గా అమ్మాయి అనేసింది యష్మీ. దానికి సంబంధించిన వీడియో కూడా నాగార్జున చూపించారు. దీంతో యష్మీ కూడా తప్పుగా అనలేదని, ఆట నుండి తను తప్పుకున్నాడు కాబట్టి అసలు తనను లెక్కపెట్టలేదని మణికి కూడా సారీ చెప్పింది. కంటెస్టెంట్స్‌తో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో బ్రేక్ ఇచ్చారు నాగార్జున. అంతలోనే సోనియా వచ్చి నిఖిల్‌ను సీత జీరో అన్నందుకు తనతో వాగ్వాదానికి దిగింది. అప్పటికీ తనకు అనిపించిందే చెప్పానని గట్టిగా మాట్లాడింది సీత. నిఖిల్ తను చెప్పిన మాటే వింటాడు, తను చెప్పిందే వింటాడు అనే విషయాన్ని ఒప్పుకోనని చెప్తూ అక్కడి నుండి వెళ్లిపోయింది సోనియా.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×