E-Paper
Advertisement

Significance of Arathi:హారతి ఇవ్వడం అసలు విషయం ఇదే.

Significance of Arathi:హారతి ఇవ్వడం అసలు విషయం ఇదే.
Advertisement

Significance of Arathi:పూజా విధానంలో మంగళహారతి చాలా ముఖ్యమైనది. మన పూజతో స్వామికి అలసట కలుగుతుంది. అందుకే స్వామికి శుభకలగాలని అని చెప్పేందుకు హారతి ఇస్తుంటాం. ప్రతీ శుభకార్యాలయంలో హారతి ఇవ్వడం సంప్రదాయంగా ఉంది. కుడి చేతి వైపు తిప్పుతూ హారతి ఇవ్వాలి. విగ్రహం చుట్టూ ఉన్న మాలిన్యాలను తీసేసే పద్దతి హారతి. దాదాపు 27 రకాలు హారతులు ఉన్నాయని అధర్వణ వేదం చెబుతోంది. మన ఇంట్లో చేసేది దూపం కానీ నెయ్యికానీ , కర్పూరం కానీ వేసి వెలిగించి దేవుడి వైపు చూపిస్తాం. వీటిలో కర్పూరంతో చేసే హారతి విభిన్నమైంది . ఘన పదార్థం కాస్త వాయు పదార్థంగా మారిపోతుంది. ఏదైనా డబ్బు ఖర్చపోతే హారతి కర్పూరంలా ఖర్చైపోయిందని అంటుంటారు.

Advertisement

సాధారణంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటలా ఇంట్లో దేవుడి పూజ చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వస్తుందని ప్రజల విశ్వాసం. ప్రస్తుతానికి ఇలా ఉన్నా మధ్యలో చాలా స్థాయిలు చెందాల్సి ఉంటుంది.. పొందాల్సి ఉంటుంది. అవేమీ చెందకుండా జ్యోతి స్వరూపంలో నీలో ఐక్యం చేసుకోమని కోరమని వేడుకునే ఉద్దేశమే హారతి. నన్ను నీకు హారతి రూపంలో సమర్పించుకుంటున్నానని చెప్పడం ఇందులో పరమార్థం. కర్పూర హారతి అక్కడ పరిసరాల్లో ఉన్న కాలుష్యాన్ని తొలగిస్తుంది.

ప్రతిరోజు ఇంట్లో పూజ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత దేవుడికి హారతి ఇస్తూ ఉంటారు. అయితే హారతి ఇచ్చేముందు పూజా పళ్లెంలో పసుపు, కుంకుమతో స్వస్తిక్ వేసి అందులో పూలు సమర్పించిన తర్వాత పళ్లెంలో దీపం పెట్టి హారతి ఇవ్వాలి. అలాగే హారతి ఇచ్చేముందు ఇచ్చిన తరువాత శంఖాన్ని ఉదాలి. వీలైతే హారతి ఇచ్చే సమయంలో ఓం అక్షరం ఆకారంలో ప్లేటును తిప్పడానికి ప్రయత్నించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఒత్తులతో కూడా హారతులు ఇస్తుంటారు. పంచహారతి నుంచి 27 వత్తులు హారతులు, కుంభహారతులు ఉంటాయి.తిరుమల వెంకటేశ్వరస్వామికి ఉదయం నవనీత హారతితో మొదలైన చివరికి ముత్యాల హారతితో ముగుస్తుంది..

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×