BigTV English

Akkineni: అక్కినేని ఫ్యామ‌లీ మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌!

Akkineni: అక్కినేని ఫ్యామ‌లీ మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌!

Akkineni:తెలుగు సినీ చరిత్ర‌లో అక్కినేని ఫ్యామిలీకి ఓ ప్ర‌త్యేకమైన గుర్తింపు ఉంది. టాలీవుడ్‌లో చాలా మంది న‌టులు, వారి వార‌సులు సినిమాలు చేస్తున్నారు. అయితే ఎవ‌రికీ లేని క్రెడిట్ అక్కినేని కుటుంబానికి ఉంది. అదంటంటే మూడు త‌రాల న‌టీన‌టులు క‌లిసి మ‌ల్టీస్టార‌ర్‌గా సినిమా చేయ‌టం. క‌పూర్ ఫ్యామిలీ త‌ర్వాత ఇండియాలోనే మూడు జన‌రేష‌న్స్ క‌లిసి న‌టించిన అరుదైన ఘ‌న‌త అక్కినేని కుటుంబానిదే. వారంద‌రూ క‌లిసి న‌టించిన చిత్రం మ‌నం. దాని త‌ర్వాత ఈ ఫ్యామిలీ హీరోలు మ‌రో సినిమాలో క‌లిసి న‌టించ‌లేదు.


అయితే త్వ‌ర‌లోనే అక్కినేని హీరోలు క‌లిసి మ‌రో సినిమాలో న‌టించ‌బోతున్న‌ట్లు సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న వార్త‌లు. స‌మాచారం మేర‌కు.. ఇంత‌కు ముందు మ‌నం చిత్రంలో నాగార్జున‌, నాగ చైత‌న్య క‌లిసి న‌టించారు. అందులో నాగేశ్వ‌ర‌రావు కీల‌క పాత్ర‌లో న‌టిస్తే.. అఖిల్ గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు నాగార్జున‌, అఖిల్ క‌లిసి న‌టించ‌బోతున్నారు. త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న రాజా ఈ మ‌ల్టీస్టార‌ర్‌ను డైరెక్ట్ చేస్తార‌ట‌. రీసెంట్‌గా మోహన రాజా చెప్పిన క‌థ, నాగార్జున‌కి నచ్చింది. ఇప్పుడు మోహన రాజా స్క్రిప్ట్ ప‌నులు ప్రారంభించార‌ట‌.

ప్ర‌స్తుతం నాగార్జున, బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నారు. అదొక మ‌ల‌యాళ రీమేక్‌. అది పూర్త‌యిన త‌ర్వాత మోహ‌న రాజా ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలో నాగార్జున, అఖిల్ న‌టిస్తార‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రో వైపు అఖిల్ త‌న లేటెస్ట్ మూవీ ఏజెంట్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది.


Pawan Kalyan: మేన‌ల్లుడితో షూటింగ్ షురూ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Premi Viswanath: అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న వంట‌ల‌క్క‌

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×